ఒప్పో మంచి ప్రత్యేకతలతో తాజాగా తీసుకొచ్చిన, ఈ Oppo K1 కేవలం రూ.16,990 రూపాయల ధరలో ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారు మాత్రమే కాకుండా దీని డిస్ప్లేని కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో తీసుకొచ్చింది. అలాగే,స్నాప్ డ్రాగన్ 660AIE ప్రాసెసరుతో ఈ స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ ఫోన్ యొక్క మొదటి సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకి Flipkart నుండి మొదలవ్వనుంది.
అయితే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయంకూడా ఒకటి వుంది. అదేమిటంటే, ఈ ఫోన్నుఒక బై బ్యాక్ గ్యారంటీతో అందిస్తోంది. ఇందుకు మీరు కేవలం 1 రూపాయి మాత్రమే చెల్లించాలి. అయితే మనకేమిటి లాభం అనుకుంటున్నారా? చాలానే లాభం ఉందండి. ఎందకంటే, ఈ ఆఫరుతో ఈ ఫోన్ను కొనేవారికి, రూ.15,300 రూపాయల బై బ్యాక్ వాల్యుని అందిస్తుంది. దీనితో ఏంటి లాభం? అని ఆలోచిస్తున్నారా. ఈ ఫోను కొనుగోలుచేసిన తరువాత 8 నెలలలోపు మీరు మరొక Oppo ఫోన్ కి అప్డేట్ అవ్వాలను అనుకుంటే, మీకు ఈ ఫోన్ ద్వారా అందిన బై బ్యాక్ వాల్యూ మీకు ఉపయోగపడుతుంది. అంటే,ఈ ఫోనుతో అందిన రూ.15,300 బై బ్యాక్ వేల్యూ అమౌంట్ మరొక ఫోన్ అప్డేట్ చేసేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది.
Oppo K1 ప్రత్యేకతలు
ఈ స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఇది 19.5:19 ఆస్పెక్ట్ రేషియాతో 91% స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు డిస్ప్లేలోఅంతర్గతంగా ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. అంతేకాదు,ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 AIE ఆక్టా కోర్ ప్రొసెసరుకి జతగా అడ్రినో 512 GPU శక్తితో వస్తుంది.ఇది కనెక్టవిటీ కోసం స్నాప్ డ్రాగన్ X12 మోడెమ్ తో వస్తుంది, ఇది 600Mbps వరకు స్పీడ్ అందిస్తుంది. ఇది 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజితో వస్తుంది
కెమేరాల విషయానికి వస్తే, వెనుక 16MP కెమేరాకు జతగా మరొక 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరాతో ఉంటుంది.ఈ ప్రధాన కెమేరా ఒక Sony IMX 398 సెన్సార్ తో వస్తుంది. ఇక ముందుభాగంలో ఒక 25MP AI సెల్ఫీ కెమెరాతో ఉంటుంది మరియు ఇది 8 రకాల బ్యూటీ కస్టమ్ మోడ్లతోవస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 ఆధారితంగా కలర్ OS 5.2 పైన నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3600mAh బ్యాటరీతో వస్తుంది మరియు పియానో బ్లాక్,ఆస్ట్రల్ బ్లూ వంటి రెండు రంగుల ఎంపికలో లభిస్తుంది.
Oppo K 1 ధర మరియు లాంచ్ ఆఫర్లు
ఇది 4GB మరియు 64GB వేరియంట్ తో మాత్రమే విడుదల చేయబడింది. ఇక ధరను గురించి చూస్తే కనుక, ఈ 4GB వేరియంట్ రూ. 16,990 ధరతో విడుదలయ్యింది. అంతేకాకుండా, ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేసేవారికి, No Cost EMI, 90% మరియు Complete Mobile Protection ప్లాన్ అఫర్ కూడా అందించింది. ఇక Citi క్రెడిట్ మరియు డెబిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికి 10%తక్షణ సేవింగ్ కూడా అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మొదటి సేల్ Flipkart.com నుండి 12 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమవుతుంది.