ఈ రోజు ఇండియాలో విడుదల కానున్న శామ్సంగ్ గెలాక్సీ S10 E, గెలాక్సీ S10 మరియు గెలాక్సీ S10+

ఈ రోజు ఇండియాలో విడుదల కానున్న శామ్సంగ్ గెలాక్సీ S10 E,  గెలాక్సీ S10 మరియు గెలాక్సీ S10+
HIGHLIGHTS

గెలాక్సీ S10, S10e, మరియు S10 ప్లస్, ఈ మూడు డివైజెస్ ను శామ్సంగ్ తాజా ఇన్ఫినిటీ- O డిస్ప్లేతో తీసుకువచ్చింది .

ముందుగా,  శామ్సంగ్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో అనేక స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. అందులో, శామ్సంగ్ దాని ప్రజాదరణ పొందిన గెలాక్సీ S సిరీస్ లైనప్ కింద మూడు కొత్త ప్రధాన స్మార్ట్ ఫోన్లను ప్రకటించింది అవి – గెలాక్సీ S10, గెలాక్సీ S10e, మరియు గాలక్సీ S10 +. వీటిలో, శామ్సంగ్ గెలాక్సీ S10 + చాలా ప్రీమియం వేరియంట్. ఇక, గెలాక్సీ S10 మరియు S10 + రెండూ కూడా గెలాక్సీ S9 యొక్క అప్డేటూగా చెప్పొచ్చు.అయితే,  ఈ గెలాక్సీ S10 త్రయంలో గెలాక్సీ S10e ఒక బడ్జెట్ ఫోన్ అవుంతుంది. అయితే, ఇప్పుడు ఈ రోజు ఇండియాలో శామ్సంగ్ గెలాక్సీ S10 E,  గెలాక్సీ S10 మరియు గెలాక్సీ S10+ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయనుంది. 

డిస్ప్లే & డిజైన్

గెలాక్సీ S10, S10e, మరియు S10 ప్లస్, ఈ మూడు డివైజెస్ ను శామ్సంగ్ తాజా ఇన్ఫినిటీ- O డిస్ప్లేతో తీసుకువచ్చింది . గెలాక్సీ S10e, S10 మరియు S10 + మధ్య ప్రధాన వ్యత్యాసంగా వాటి డిస్ప్లే పరిమాణం గురించి చెప్పొచ్చు. ఈ గాలక్సీ S10e ఒక 5.8-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, అయితే గెలాక్సీ S10 కొద్దిగా పెద్దదైన ఒక 6.1-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. ఇక ప్రీమియం వేరియంట్ అయిన, S10 + ఒక పెద్ద 6.4-అంగుళాల క్వాడ్ HD ప్యానెల్ను కలిగి ఉంది. ఈ మూడు పస్మార్ట్ ఫోన్లలో, ఒక నోచ్ కు బదులుగా,  సెల్ఫీ కెమెరా కోసం ముందు డిస్ప్లేలో పంచ్ హోల్ ఉంటుంది. అయితే, గాలక్సీ S10e మరియు S10 తో పోలిస్తే గెలాక్సీ S10 + కొద్దిగా పెద్దదైన పంచ్ హోల్ తో వస్తుంది. ఎందుకంటే, ఇది ముందుభాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అంతేకాక, మరో ప్రధాన వ్యత్యాసం కూడా ఉంది, అదేమిటంటే  గెలాక్సీ S10 మరియు S10 + లు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తాయి, కానీ  S10e  ఫ్లాట్ ప్యానెల్ తో వస్తుంది.

గెలాక్సీ S10 మరియు S10 + రెండు కూడా ఒక కొత్త అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సారును కలిగి ఉంటాయి, ఇది డిస్ప్లేలో పొందుపరచబడింది. అయితే, ఈ టెక్నాలజీ  గెలాక్సీ S10e లో మాత్రం అందించలేదు.

ప్రాసెసర్, RAM మరియు స్టోరేజ్

ఇక వీటి పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినప్పుడు, గెలాక్సీ S10e మరియు గెలాక్సీ S10 ఒక Exynos ద్వారా ఆధారితమైన 9820 ఆక్టా కోర్ ప్రాసెసర్ తో నడుస్తాయి. గెలాక్సీ S10e – 6GB / 128GB మరియు 8GB / 256GB స్టోరేజి వంటి రెండు వేరియంట్ మోడల్లలో లభిస్తుంది. మరోవైపు, సంస్థ గెలాక్సీ S10 ను 8GB / 256GB వేరియంట్ మాత్రమే విడుదల చేసింది. ఇందులో ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజి విస్తరించవచ్చు. ఇక గెలాక్సీ S10 + యొక్క గురించి చూస్తే, ఇది ప్రీమియం డివైజ్ అయినాకూడా, ఇది అదే ఎక్సినోస్ 9820 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 128GB, 512GB మరియు 1TB స్టోరేజి మోడల్లలో అందుబాటులో ఉంటుంది. ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు.

కెమేరాలు

గెలాక్సీ S10e వెనుక భాగంలో 16MP + 12MP  డ్యూయల్ కెమెరాలు ఉన్నాయి, ఇది 16MP సెన్సార్ అల్ట్రా-వైడ్ ఫోటోలను క్లిక్ చేయడానికి ఉపయోగించవచ్చు. అలాగే, స్వయంచాలకంగా 30 వేర్వేరు సన్నివేశాలను ఆటోమేటిగ్గా కనుగొనగల మెరుగైన శామ్సంగ్ ఆప్టిమైజ్ ఫీచర్ ఉంది. మరొక వైపు, శామ్సంగ్ గెలాక్సీ S10 మరియు S10 + ఒక ట్రిపుల్ 16MP + 12MP + 12MP వెనుక కెమెరాలని కలిగి ఉంటాయి. గెలాక్సీ S10e లో లేనటువంటి12MP కెమేరా 2x ఆప్టికల్ జూమ్ ని అనుమతిస్తుంది.

ముందు, గెలాక్సీ S10 మరియు S10e సెల్ఫీ క్లిక్ కోసం ఒక 10MP సెన్సార్ కలిగివున్నాయి. ఇక గెలాక్సీ S10 + ముందుభాగంలో డ్యూయల్ 10MP + 8MP ఫ్రంట్ కెమెరాలు ఉంటాయి. ముందు అందించిన 8MP డెప్త్ సెన్సార్ మీరు బెక్హె ఎఫెక్టుతో సెల్ఫీలను క్లిక్ చేయడానికి అనుమతిస్తుంది.

ధర

శామ్సంగ్ గెలాక్సీ S10e  రూ. 55,900 ప్రారంభ దరతో అమేజాన్ నుండి ప్రీ ఆర్డర్స్ కోసం అందుబాటులో ఉంటుంది. మరోవైపు, గెలాక్సీ S10 8GB / 128GB వేరియంట్ రూ. 66,900 ప్రారంభ దరతో అమేజాన్ నుండి ప్రీ ఆర్డర్స్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇక ఈ మూడు స్మార్ట్ ఫోన్లలో ప్రీమియం ఫోన్ అయిన, గెలాక్సీ S10 +  రూ. 73,900 ప్రారంభ దరతో అమేజాన్ నుండి ప్రీ ఆర్డర్స్ కోసం అందుబాటులోవుంది. అయితే,  

 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo