అంచనాలకంటే తక్కువ ధరకే విడుదలైన రియల్ మీ 2 ప్రో :ధర, ప్రత్యేకతలు మరియు మరిన్ని వివరాలు

Updated on 27-Sep-2018
HIGHLIGHTS

ఈ రోజు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరలు,మరియు ప్రత్యేకతలు వెల్లడి.

అద్భుత విజయం సాధించిన రియల్ మీ 2 యొక్క వారసునిగా ప్రకటించిన ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర ఇప్పటివరకు గోప్యంగా ఉన్నా, ఈ రోజు జరిగిన ప్రత్యక్ష విడుదల కార్యక్రమంలో దీని ధర వెల్లడించారు. రియల్ మీ 2 ప్రో – 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి , 6జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజి మరియు 8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజి మూడు వేరియంట్లలో విడుదల చేయబడింది. వీటి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

1. 4జీబీ ర్యామ్  మరియు  64జీబీ స్టోరేజి ధర   – రూ . 13,990

2. 6జీబీ ర్యామ్  మరియు  64జీబీ స్టోరేజి ధర   – రూ . 15,990

3. 8జీబీ ర్యామ్  మరియు  128జీబీ స్టోరేజి ధర – రూ . 17,990

ఈ రియల్ మీ 2 ప్రో, అక్టోబరు 11 వ తేది 00:00 AM గంటలకు అంటే కచ్చితంగా రాత్రి 12 గంటలకు మొదటి సారిగా ప్రత్యేకంగా ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకానికి ఉండనుంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ కొనడానికి పైన తెలిపిన సమయానికి ఆన్లైన్లో సిద్ధంగా ఉండవలసివుంటుంది.

రియల్ మీ 2 ప్రో  ప్రత్యేకతలు (స్పెసిఫికేషన్స్)

రియల్ మీ 2 యొక్క అధిక స్థాయి ఫోన్ గా వచ్చినట్లు తెలిపిన ఈ రియల్ మీ 2 ప్రో డ్యూ డ్రాప్ డిస్ప్లే తో అలరిస్తుంది. ఇయర్ పీస్,లైట్ సెన్సార్ మరియు ముందు కెమేరా కూడా ఏ డ్యూ డ్రాప్ లోనే ఇవ్వబడ్డాయి.ఈ ఫోన్ డ్యూ డ్రాప్ ఫుల్ స్క్రీన్ తో ఒక 6.3 అంగుళాల ఫుల్ హెచ్ డి+ డిస్ప్లేతో వస్తుంది మరియు ఇది 2340×1080 పిక్సెళ్ళును అందిస్తుంది. ఈ ఫోన్ 19.5:9 యాస్పెక్ట్ రేషియో తో 90.8 స్క్రీన్ నిష్పత్తిని కలిగి ఉంటుంది.ఇది స్నాప్ డ్రాగన్ 660 AIE ఆక్టా కోర్ మరియు అడ్రినో 512 GPU ప్రాసెసర్ చేత నడపబడుతుంది. ఇది కలర్ OS 5.2 తో కూడిన ఆండ్రాయిడ్ 8.1 ఓరెయో తో నడుస్తుంది. దీని ప్యానెల్ 15 లేయర్ల లామినేటెడ్ టెక్ తో అందించబడింది.ఈ స్మార్ట్ ఫోన్, ప్రకృతి నుండి ప్రేరణ పొందిన మూడు రంగులలో అందించారు అవి- ఐస్ లేక్ ,బ్లూ ఓషన్ మరియు బ్లాక్ సీ.

దీనిలో f /1.7 ఏపర్చేర్ గల Sony IMX398 లెన్స్ తో కూడైన 16 MP + 2MP డ్యూయల్ వెనుక కెమేరా  6P లెన్స్ టెక్నాలజీతో మరియు AI సీన్ రికగ్నైజేషన్ తో కలిగివుంది. ముందు f /2.0 ఏపర్చేర్ ట్ కూడిన 16 మెగాపిక్సెల్ కెమేరా ని ఇచ్చారు, దీనిలో AI బ్యూటీఫై మోడ్ మరియు పోర్ట్రైట్ మోడ్ అందుబాటులో ఉంటుంది. ఇది రియల్ మీ 2 కంటే కొంచెం తక్కువ సామర్ధ్యం గల 3,500mAh బ్యాటరీతో వస్తుంది. 

ఆశ్చర్యకరంగా మరొక ఎంట్రీ – లెవల్ ఫోన్ రియల్ మీ సి 1 కూడా రియల్ మీ 2 ప్రో తో పాటుగా విడుదల చేయబడింది. 

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :