ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ శామ్సంగ్ గెలాక్సీ A9 క్వాడ్ కెమేరా స్మార్ట్ ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12:30 నిమిషాలకి రూ. 36,990 ప్రారంభ వేరియంట్ ధరతో విడుదలయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్, 6GB మరియు 8GB వంటి రెండు ర్యామ్ వేరియంట్లలో విడుదల చేయబడింది. అలాగే, ఈ డివైజ్ బ్లాక్, బ్లూ మరియు పింక్ రంగు ఎంపికలతో ఉంటుంది.
శామ్సంగ్ గెలాక్సీ A9 ధరలు
శామ్సంగ్ గెలాక్సీ A9 యొక్క ప్రారంభ వేరియంట్ అయినటువంటి 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి ఇండియా మార్కెట్ ధర రూ. 36,990 మరియు రెండవ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజి వేరియంట్ యొక్క ఇండియా మార్కెట్ ధర రూ. 39,990 గా ప్రకటించింది. ఈ ఫోను యొక్క ప్రీ అర్డర్లను ఈ రోజు నుండి చేసుకోవచ్చని శామ్సంగ్ తెలిపింది.
ఆఫర్లు మరియు అందుబాటు
నవంబర్ 20 వ తేదీనుండి, ఈ శామ్సంగ్ గెలాక్సీ A9 స్మార్ట్ ఫోన్, అమేజాన్, శామ్సంగ్ ఆఫ్లైన్ స్టోర్లు, పేటియం మాల్, ఫ్లిప్ కార్ట్ మరియు ఎయిర్టెల్ ఆన్లైన్ స్టోర్ వంటి వాటినుండి ప్రీ బుకింగ్ కూడా చేయవచ్చు. HDFC బ్యాంకు యొక్క డెబిట్ మరియు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలుతో, 3,000 రూపాయల క్యాష్ బ్యాక్ అఫర్ చేస్తున్నట్లు, ఈ ఫోన్ విడుదల కార్యక్రమంలో ప్రకటించారు.
శామ్సంగ్ గెలాక్సీ A9 ప్రత్యేకతలు
ఈ ఫోన్, వెనుకభాగంలో, క్వాడ్ కెమేరా ఒక 24MP ప్రధాన కెమెరా f / 1.7 ఎపర్చరు లెన్స్తో, ఒక 8MP సెన్సార్ను కలిగి ఉంది. Af / 2.4,120-డిగ్రీ అల్ట్రా వైడ్ లెన్సుతో, 10MP సెన్సార్ను f / 2.4 టెలిఫోటో కెమెరాతో 2X ఆప్టికల్ జూమ్ మరియు ఒక 5MP డెప్త్ సెన్సింగ్ కెమెరా /2.2 ఎపర్చరు. ముందు, f / 2.0 ఎపర్చరుతో 24MP కెమెరా ఉంది. గెలాక్సీ A9 యొక్క ప్రధాన కెమెరా పిక్సెల్ బిన్నింగ్ టెక్నాలజీని కలిగివుంటుంది. ఈ ముందు కెమేరా పేస్ అన్లాక్ చేయడానికి అనుకూలిస్తుంది. ఒక 6.3-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లే తో 18: 9 యాస్పెక్ట్ రేషియో మరియు 1080 x 2220 పిక్సెల్ రిజుల్యూషన్తో ఉంటుంది. ఇది స్నాప్డ్రాగెన్ 660 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా 2.2GHz వద్ద క్లాక్ చేయబడి మరియు 1.8GHz వద్ద మిగిలిన తక్కువ పవర్-కోర్లను కలిగి ఉంది.
ఈ పరికరం, 128GB అంతర్గత నిల్వతో కలిపి, 6GB మరియు 8GB RAM వంటి రెండు వైవిధ్యాలతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోనులో ఒక 3800mAh బ్యాటరీని అమర్చారు, ఇది వేగవంతమైన ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది మరియు ఇది Android 8.0 Oreo తో నడుస్తుంది. అంతేకాకుండా, మైక్రో SD కార్డు ద్వారా దీని యొక్క స్థిరజీ సామర్ధ్యాన్ని 512GB వరకు పెంచవచ్చు. ఈ స్మార్ట్ ఫోను Dolby Atmos ఆడియో సపోర్టుతో వస్తుంది.