‘హానర్ 7ఎస్’ ని ఇండియా లో రూ . 6,999 ధరతో విడుదల చేసింది: 18:9 డిస్ప్లే ఇంకా 3,020mAh బ్యాటరీ ఇంకా మరిన్ని వివరాలు

‘హానర్ 7ఎస్’ ని ఇండియా లో రూ . 6,999 ధరతో విడుదల చేసింది: 18:9 డిస్ప్లే ఇంకా 3,020mAh బ్యాటరీ ఇంకా మరిన్ని వివరాలు
HIGHLIGHTS

హానర్ 7ఎస్ 2GB RAM మరియు 16GB అంతర్గత స్టోరేజితో వస్తుంది. ఇది 18: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియో తో 5.45 అంగుళాల HD + స్క్రీన్ కలిగి ఉంటుంది.

భారతదేశంలో హానర్ 7A మరియు 7C లను ప్రారంభించిన తరువాత, ఆ సంస్థ దాని పోర్ట్ ఫోలియోకు ఆనర్ 7S స్మార్ట్ఫోన్ను కూడా జత చేసింది. ఈ కొత్త డివైజ్  హానర్ యొక్క పనితీరుతోబాటుగా సరసమైన స్మార్ట్ఫోన్లను తీసుకువచ్చినది మరియు హానర్ 7S ఫోన్10వేల ఉపవర్గంలోకి వస్తుంది, ఇది రెడ్మి నోట్  5, రియల్ మీ  2 మరియు ఇంకా ఇతర ఇదే వర్గ  ఫోన్లకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ కొత్త డివైజ్లో హైలైట్లు 18: 9 డిస్ప్లే, 3,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, స్మార్ట్ బ్యాటరీ నిర్వహణ సామర్థ్యాలతో లభిస్తాయి.

హానర్ 7ఎస్ ధర

ఈ హానర్ 7ఎస్ 2జీబీ ర్యామ్ మరియు 64జీబీ  అంతర్గత మెమొరీతో కూడిన ఒకే ఒక వేరియంట్ తో వస్తుంది.  దీని ధర రూ . 6,999 గా ఉంటుంది మరియు ఈ డివైజ్ సెప్టెంబరు 14 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ మరియు కంపెనీ వెబ్సైట్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉండనుంది.ఇది మూడు రంగులలో అందుబాటులో ఉండనుంది అవి :బ్లూ ,మాట్టే బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ ఎంపికలతో ఉంటాయి.

హానర్ 7ఎస్ స్పెసిఫికేషన్స్

హానర్ 7ఎస్  18: 9 డిస్ప్లే యాస్పెక్ట్ రేషియాతో ఒక 5.45-అంగుళాల HD + స్క్రీన్ ను కలిగి ఉంటుంది మరియు ఇది ఒక చేతితో ఉపయోగించడం సులభతరం అయ్యేలా రూపొందించబడింది. ఇది క్వాడ్-కోర్ మీడియా టెక్ M7067 SoC ద్వారా శక్తిని పొందింది మరియు ఇది 2GB RAM మరియు 16GB అంతర్గత స్టోరేజితో జత చేయబడుతుంది, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. ఇది డ్యూయల్ సిమ్ స్మార్ట్ఫోన్ అంతేకాకుండా  Android 8.1 Oreo తో నడుస్తుంది మరియు యాప్ స్క్రీన్ స్ప్లిట్ మోడ్ వంటి అదనపు ఫీచర్లతో వస్తుంది,  ట్యాప్ తో వేకప్  మరియు ఐ ప్రొటక్షన్ మోడ్ను ఎనేబుల్ చేసే నీలి కాంతి ఫిల్టర్లతో వస్తుంది.

ఆప్టిక్స్ పరంగా, స్మార్ట్ఫోన్ PDAF మద్దతుతో పాటుగా LED ఫ్లాష్ తో 13MP వెనుక సెన్సార్ కలిగి వస్తుంది. వెనుకవైపు సెకండరీ సెన్సార్ లేదు కానీ ఇది పోర్ట్రైట్  షాట్లు సంగ్రహించడంలో మద్దతు ఇస్తుంది. ముందు 5MP సెన్సార్ ఉంది. బ్యాటరీ లైఫ్, మొత్తం రోజుకు సరఫరా చేయగల 3,020 mAh బ్యాటరీతో స్మార్ట్ఫోన్ మద్దతు ఇస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇందులో అందుబాటులో లేదు కానీ ఫేస్ అన్లాక్ ఫీచర్తో వస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo