ఫ్లిప్ కార్ట్ – ఎక్స్క్లూజివ్ హానర్ 7S బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు 2PM కి ఇండియాలోవిడుదల కానుంది

ఫ్లిప్ కార్ట్ – ఎక్స్క్లూజివ్ హానర్ 7S బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు 2PM కి ఇండియాలోవిడుదల కానుంది
HIGHLIGHTS

హానర్ 7S పి.కె.ఆర్ 14,999 ధరతో పాకిస్తాన్ లో మే నెలలో ప్రారంభించబడింది, ఇది సుమారు రూ. 8,500. ఇది 18:9 యాస్పెక్ట్ రేషియాతో 5.45 అంగుళాల HD + డిస్ప్లేని కలిగి ఉంది.

పాకిస్థాన్ లో ప్రారంభించిన మూడు నెలల తరువాత, హానర్ ఈరోజు భారతదేశంలో ఈ బడ్జెట్ హానర్ 7S స్మార్ట్ఫోన్ ని ఆవిష్కరించనుంది. సంస్థ పాకిస్తాన్లో PKR 14,999 ధర వద్ద హానర్ 7S ను ప్రారంభించింది, ఇది సుమారు మనకు రూ .8,500 గా మార్పిడి చేయబడింది. అదే సమయంలో, భారతదేశంలో హానర్ 7A మరియు హానర్ 7C ఫోన్లను ఆవిష్కరించింది.

హానర్ భారతదేశంలో హానర్ 7S కోసం ఒక ఆన్లైన్ ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది మరియు ఈ రోజు 2PM నుంచి కంపెనీ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లో ప్రత్యక్షంగా ప్రసారం కూడా  చేయబడుతుంది. మీరు సాధారణ అప్డేట్ కోసం కంపెనీ ట్విట్టర్ ని కూడా అనుసరించవచ్చు. ఈ డివైజ్ ని హువావే ఇండియా – కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ సేల్స్ అయిన, అజయ్ వీర్ సింగ్ మరియు  ఫ్లిప్కార్ట్ యొక్క మొబైల్స్ అండ్ లార్జ్ అప్లయన్స్ VP,  పి సంజీవ్ ఆవిష్కరిస్తారు. Flipkart ప్రమేయం కారణంగా, హానర్ 7S e -కామర్స్ వేదికకు ప్రత్యేకమైనదిగా భావిస్తున్నారు.

ధర మరియు లక్షణాలు పరంగా చుస్తే, హానర్ 7S అనేది ఒక స్మార్టుఫోన్ మరియు ఇది పూర్తిగా షియోమీ రెడ్ మీ 5A కి వ్యతిరేకంగా పోటీ ఉంటుంది. సుమారుగా మార్చబడిన విలువ కంటే సంస్థ తక్కువ ధర వద్ద స్మార్ట్ఫోన్ను ప్రారంభించవచ్చు. హానర్ 7S స్మార్ట్ఫోన్ను గెలుచుకోవడానికి ఆసక్తి ఉన్నవారు Twitter లోని ఆన్లైన్ పోటీలో కూడా పాల్గొనవచ్చు. "ఇక్కడ రాబోయే స్మార్ట్ఫోన్ # హానర్ 7S గెలుచుకునే ఈ అవకాశం మీ కోసం ! స్పిన్ ది వీల్ & గెట్ లక్కీ," అని పోటీ నిర్వహిస్తున్నట్లు కంపెనీ ట్వీట్ చేసింది.

హానర్ 7ఎస్ స్పెసిఫికేషన్స్

హానర్ 7S ఒక 5.45-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1440 పిక్సల్స్ మరియు 18: 9 యాస్పెక్ట్ రేషియాతో కలిగి ఉంటుంది. స్మార్ట్ఫోన్ ఒక మీడియా టెక్ MT6739 ప్రాసెసర్ చేత మరియు 2GB RAM + 16GB స్టోరేజిని కలిగి ఉంది, ఇంకా దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించవచ్చు. ఒక 3020mAh బ్యాటరీతో హ్యాండ్సెట్ మద్దతు ఇస్తుంది మరియు ఆండ్రాయిడ్ 8.1 Oreo తో నడుస్తుంది. కెమెరా విభాగంలో, హానర్ 7S  డిటెక్షన్ ఆటో ఫోకస్ (PDAF) మరియు ఒక LED ఫ్లాష్ తో  ఒక వెనుక 13MP కెమేరాని కలిగి ఉంది. ముందు, ఈ డివైజ్ సాఫ్ట్ ఫ్లాష్ తో 5ఎంపీ  షూటర్ తో వస్తుంది. హానర్ 7S లో స్మార్ట్ ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo