Oppo K 1 ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ఇండియాలో విడుదలకానుంది

Updated on 06-Feb-2019
HIGHLIGHTS

Oppo K 1 స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో చైనాలో గత సంవత్సరం లాంచ్ అయ్యింది.

ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో నడుస్తున్న పోటీకి అనుగుణంగా, మహాసి ఫీచర్లతో గత సంవత్సరం చైనాలో విడుదల చేసిన Oppo K1 స్మార్ట్ ఫోన్ను ఏ రోజు ఇండియాలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను చేసింది ఒప్పో సంస్థ. ఈ స్మార్ట్ ఫోన్ను ఒక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో తీసుకురావడం విశేషం. ఇందులో విశేషం ఏముందంటారా? ఈ ఫోన్ యొక్క బేసిక్ వేరియంట్ అయిన 4GB వేరియంట్ చైనాలో 1599 యువాన్ ధరతో విడుదల చేసింది, ఈ మొత్తాన్ని ఇండియా రూపాయితో మనం తర్జుమా చేసి చుస్తే కనుక సుమారు 16,850 రూపాయలుగా ఉంటుంది. ఒకవేళ ఇదే ధరతో ఈ ఫోన్ను విడుదల చేస్తే కనుక, మిడ్ రేంజ్ విభాగంలో తక్కువ ధరతో మార్కెట్లో లభించే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ ఇదే అవుతుంది.      

అయితే, విడుదల సమయంలో దీని ప్రైస్ తెలిపిన తరువాత ఈ మాట నిజమయ్యే అవకాశముంటుంది. ఒక్క ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర లక్షణాలు కూడా ఈ ఫోన్ను ఆకట్టుకునేలా చేస్తాయి.             

Oppo K1 ప్రత్యేకతలు

గత సంవత్సరం చైనాలో విడుదలైన ఈ స్మార్ట్ ఫోన్, 1080 x 2340 రిజల్యూషన్ కలిగిన ఒక 6.4 అంగుళాల డిస్ప్లేతో వచ్చింది. ఇది 19.5:19 ఆస్పెక్ట్ రేషియాతో 91%  స్క్రీన్-టూ-బాడీ రేషియోని అందిస్తుంది. ఇది ఒక వాటర్ డ్రాప్ నోచ్ మరియు డిస్ప్లేలోఅంతర్గతంగా ఒక ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్  2.2GHz వేగంతో క్లాక్ చేయబడిన, ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రొసెసరుతో వస్తుంది. చైనాలో, ఇది 4GB మరియు 6GB వేరియంట్ల యొక్క ఎంపికలతో వచ్చింది మరియు ఒక మైక్రో SD కార్డుతో 256GB వరకు దీని స్టోరేజిని పెంచుకోవచ్చు.        

కెమేరాల విషయానికి వస్తే, వెనుక 16MP కెమేరాకు జతగా మరొక 2MP సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమేరాతో ఉంటుంది. ఇక ముందుభాగంలో ఒక 25MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ ఓరెయో 8.1 తో నడుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 3600mAh బ్యాటరీతో వస్తుంది మరియు                            

Oppo K 1 ధరలు

ఇది చైనాలో 4GB మరియు 6GB వంటి రెండు వేరియంట్లలో విడుదల చేయబడింది. ఇక చైనాలో ధరలను గురించి చూస్తే కనుక, ఈ 4GB వేరియంట్ 1,599 యువాన్ (సుమారు రూ. 16,850) మరియు 6GB వేరియంట్ 1,799 యువాన్ (సుమారు రూ. 19,000) ధరతో వచ్చాయి. అయితే, భారతదేశంలో విడుదలయ్యేప్పుడు వీటి ధరలలో మార్పు వుండవచ్చు.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :