Sony xperia XZ4 యొక్క 21:9 డిస్ప్లేలో వీడియో ఇలావుంటుంది
టిప్స్టర్ ఐస్ యూనివర్స్ Sony Xperia XZ4 లో వీడియో-వాచింగ్ అనుభవానికి ఒక మాక్ డెమోను ఇస్తుంది.
ముఖ్యాంశాలు:
1. టిప్స్టర్ ఐస్ యూనివర్స్ Sony Xperia XZ4 లో వీడియో-వాచింగ్ అనుభవానికి ఒక మాక్ డెమోను ఇస్తుంది
2. ఈ టిప్స్టర్, ఫోన్ యొక్క స్క్రీన్ ప్రొటెక్టర్ యొక్క ఫోటోలను కూడా ట్విట్టర్లో చూపిస్తుంది
రాబోయే సోనీ Xperia ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ గురించి వివరాలు క్రమ క్రమంగా తేటతెల్లమవుతున్నాయి. ఒక వారం క్రితం, సోనీ Xperia XZ4 చాలా పొడవుగా ఒక 21: 9 డిస్ప్లేతో వస్తానని కనుగొన్నాము, ఎందుకంటే ఆరోపణలకు సంబంధించిన ఒక స్క్రీన్ ప్రొటెక్టర్ ఇపుడు గుర్తించబడింది. ఇప్పుడు ఆన్లైన్ టిప్స్టెర్ ఐస్ యూనివర్స్, ఒక స్క్రీన్ ప్రొటెక్టరుతో వీక్షించడం ద్వారా మానాకు ఈ ఫోన్లో వీక్షణా అనుభవాన్ని మనకు అందించడానికి చూస్తున్నారు.
కొన్ని రోజులు క్రితం YouTube లో అప్లోడ్ చేయబడిన ఇటీవలి వీడియోలో, ఈ నమూనా వీడియోను ప్లే చేస్తున్నప్పుడు, 21: 9 ఆస్పెక్ట్ రేషియోలో స్క్రీన్ ప్రొటెక్టర్ను మొజాయిక్ చేసిందని తెలుస్తోంది, Xperia XZ4 యొక్క డిస్ప్లే ఎలావుంటుందో తెలుపడంకోసం. ఈ వీడియో వలన, రాబోయే స్మార్ట్ఫోన్ గురించి మనకు తెలియని ఏటువంటి సూచనాత్మక వివరణా సమాచారం తెలియచేస్తుంది, అని పరిశీలిద్దాం.
YouTube లో పబ్లిక్ వీడియోను అప్లోడ్ చేయడమే కాకుండా, ఐస్ యూనివర్స్ ట్విటర్లో స్క్రీన్ ప్రొటెక్టర్ ఫోటోలను కూడా పోస్ట్ చేసింది, Xperia XZ4 యొక్క డిస్ప్లే 15.2 సెంటీమీటర్ల పొడవుగా ఉంటుంది, ఇది దాదాపుగా ఐఫోన్ XS మాక్స్ యొక్క పొడవుకు సమానం. అయితే స్క్రీన్ ప్రొటెక్టర్ నుండి స్పష్టంగా ఏమి తెలుస్తుందంటే, Xperia XZ4 యొక్క డిస్ప్లేలో ఏరకమైన నోచ్ లు లేవు. ఇయర్పీస్ కోసం కట్ అవుట్స్, ఒక కెమెరా, మరియు ఒక LED ఫ్లాష్ ను ఈ స్క్రీన్ ప్రొటెక్టరులో చూడవచ్చు.
మేము చూసిన మరియు ముందు విన్న వాటి ప్రకారం, ఈ సోనీ Xperia XZ4 ఒక 6.5-అంగుళాల OLED డిస్ప్లేతో వస్తాయి. 21: 9 విస్తీర్ణంలో ఉన్న ఆస్పెక్ట్ రేషియోలో, ఈ డిస్ప్లే రోజువారీ ఉపయోగం కోసం వినియోగదారుడి వేళ్లు యెంత పొడవైన సరే ఇబ్బందిలేకుండా, చాలా పొడవుగా ఉంటుంది. సోనీ, దానిపై సాఫ్ట్ వేర్ను సాఫ్ట్-యాక్సెస్ సత్వరమార్గంతో తయారు చేయగలదు, కాబట్టి తెరపై ఉన్న ఎలిమెంట్స్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేరుకోవచ్చు, ఇది కొన్ని ఆపిల్ ఐఫోన్లలో కనిపించే లక్షణం లాంటిది.
సోనీ ఎక్స్పీరియా XZ4, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 855 చిప్సెట్ చేత శక్తినివ్వగలదని భావిస్తున్నారు. RAM + స్టోరేజ్ ఎంపికలు 6GB + 64GB మరియు 8GB + 128GB అని చెప్పబడింది. ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ఈ హ్యాండ్సెట్ కి చెందిన AnTuTu బెంచ్మార్క్ స్కోర్ 395721 గా వచ్చింది. మరికొన్ని ఇతర నివేదికల ప్రకారం, Xperia XZ4 ఒక ట్రిపుల్ రియర్ కెమెరాతో మరియు 3,900mAh బ్యాటరీని క్విక్ ఛార్జ్ 4.0 కి మద్దతుతో ఇస్తుంది. మనము మరిన్ని లీకుల ద్వారా, సోనీ యొక్క రాబోయే ప్రధాన స్మార్ట్ఫోన్ గురించి మరింత తెలుసుకునే అవకాశముంది.