ప్రస్తుతం, ఒక స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు చూసే ప్రధాన టాప్ ఫీచర్లలో కెమెరా ఒకటి. అయితే, అధిక మెగాపిక్సెల్ సంఖ్య మెరుగైన చిత్రాలను అందించడంలో సహాయం చేస్తుంది. చాలా DSLR కెమేరాలు 24MP సెన్సార్స్ తో అందించే విధంగా ఉంటాయి, కానీ ఇప్పటికీ ఉత్కంఠభరితమైన చిత్రాలు తీస్తుంటాయి. ఈ కెమేరా తయారీదారులు, వినియోగదారులకు వివిధ కెమెరా సెట్టింగుల పైన మంచి నియంత్రణ ఇచ్చేలా వాటిని అందిస్తారు. కాబట్టి వీటిగురించి బాగా తెలిసివున్నవారు DSLR ఉపయోగించి వారికీ నచ్చిన అందమైన మరియు ఆకట్టుకునే షాట్లను తీసుకోగలుగుతారు. అయితే, చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు డిఫాల్ట్ కెమెరా మోడ్ ఉపయోగించి ఫోటోలను తీస్తుంటారు. అందువల్ల, వారు ఫోటో తీసేప్పుడు ఆంబియాంట్ సెన్సార్ కారణంగా ఉత్తమమైన ఫోటోను తీసుకోనవసరం లేదు. చాలా ఫోన్లు ఒక 'ప్రో' మోడ్ని అందిస్తుంటాయి, సగటు వినియోగదారునికి ఇది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
ఈ సమస్యకు సమాధానం కెమెరా సెట్టింగులను, తనంతట తానే ఆటొమ్యాటిగ్గా మార్చడానికి తగిన డిఫాల్ట్ కెమెరాను తయారు చేయడం. OPPO వంటి గ్లోబల్ తయారీదారు ఈ చర్యలో మార్పులు చేయడానికి AI యొక్క శక్తిని ఉపయోగించడం ద్వారా ఈ విధంగా చేసారు. OPPO F11 Pro , దాని సరికొత్త స్మార్ట్ ఫోనుతో, ఈ సంస్థ ఫోటోలను మరింత మెరుగ్గా చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్ మరింత అందంగా ఆసక్తికరమైన కెమెరా వివరణలను అందిస్తుంది, ఇది మెరుగుపరచిన AI ద్వారా సూపర్ గా ఉంటుంది.
స్పెక్స్ ఫోన్ను నిర్ధారిస్తాయి
OPPO F11 Pro స్మార్ట్ ఫోనులో ఉపయోగించిన AI టెక్ యొక్క గూఢమైన పనితనాన్ని చూసే ముందు, దీని హార్డ్ వేర్ గురించి కొంచం తీసుకుందాం. OPPO F11 Pro వెనుక ఒక 48MP + 5MP సెటప్ కలిగిన డ్యూయల్ -రియర్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ ఫోను కెమెరా ఒక పెద్ద F1.79 ఎపర్చరు లెన్స్ తో ఉంటుంది. ఇది సెన్సర్లోకి మరింత కాంతిని అనుమతినిస్తుంది. ముందు మీరు ఫోన్ యొక్క బాడీ నుండి పైకి లేచేలా ఏర్పాటు చేసిన ఒక 16MP కెమెరాని అందుకుంటారు. కాబట్టి మీరు డిస్ప్లేలో నోచ్ అందుకోవాల్సిన అవసరం లేదు.
చీకటి అంటే భయపడకండి
OOPPO F11 Pro, చీకటిలో కూడా ప్రకాశవంతమైన ఫోటోలను తీసుకోవడానికి, దానిలో ముందుగా అందించిన అల్ట్రా నైట్ మోడ్ తో దాని భారీ 48MP వెనుక సెన్సార్ను కలుపుతుంది. ఈ ఫోన్ లో ఉపయోగించిన 4-ఇన్ -1 టెక్నాలజీ నాలుగు పిక్సెల్లను కలగలిపి ఒకటిగా చేస్తుందని, OPPO సూచించింది, తద్వారా ఫోటోలో వుండే సెన్సిటివ్ ప్రాంత పరిమాణాన్ని సమర్థవంతంగా అధికం చేసింది. అంతేకాక, ఇది 1 / 2.25 అంగుళాల సెన్సర్ను కూడా కలిగి ఉంది, ఇది తక్కువ కాంతి పరిస్థితుల్లో తీసుకునే చిత్రాల యొక్క నాణ్యతను కూడా మరింత మెరుగుపర్చడానికి సహాయం చేస్తుంది.
లైట్ లేకున్నాకూడా అధిక బ్రైట్నెస్
పరిసర కాంతి నిజంగా తక్కువగా ఉన్న సందర్భాలలో, OPPO యొక్క సొంత AI అల్ట్రా-క్లియర్ ఇంజిన్ రంగంలోకి వస్తుంది. ఈ ఫీచర్ AI ఇంజిన్, ఆల్ట్రా నైట్ మోడ్ మరియు డాజ్జెల్ కలర్ మోడ్ యొక్క కలయికను, మంచి ఫోటోలను తీయడానికి వాడుతుందని సంస్థ పేర్కొంది. అల్ట్రా నైట్ మోడ్ ఫోటోని స్థిరంగా ఉంచడం కోసం ఆప్టిమైజేషన్ను ఉపయోగించుకుంటుంది, ఇది సుదీర్ఘ షాట్ల సమయంలో చాలా అవసరమైన ఫీచర్. ఇంకా, ఫోటోల యొక్క పోర్ట్రైట్ మరియు బ్యాగ్రౌండ్ దృశ్యాలు విడివిడిగా ప్రాసెస్ చేయబడతాయి, ఇవి ఫోటోలలో మరింత సహజంగా కనిపించే స్కిన్ టోన్లను నిర్ధారిస్తాయని, OPPO పేర్కొంది.
రీ ఫోకస్ -DAZZEL కలర్ మోడ్
చాలామంది ప్రజలు వారి స్మార్ట్ ఫోన్ నుండి వైబ్రాంట్ మరియు రంగుల చిత్రాలను తీయడాన్ని ఇష్టపడతారు. దీన్నిపోస్ట్ ప్రొడక్షన్ లో చేయవచ్చు అంటే ఫోటో తీసిన తరువాత మార్చుకోవచ్చు. అయితే, ఇందులో ఒక సమస్యవుంది, ఇది స్కిన్ టోన్లను అసహజంగా తయారు చేస్తుంది. అయితే, OPPO F11 ప్రోలో డాజిల్ కలర్ మోడ్ ద్వారా, ఫోన్ యొక్క AI ఇంజిన్ను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఇది టార్గెట్ చేస్తుంది. ఈ ఫోన్ స్కిన్ట్ టోన్ నియంత్రణ మాడ్యూల్ను కలిగి ఉందని సంస్థ పేర్కొంది, అంతేకాకుండా ఫోటోలోని స్కిన్ కలర్ మరియు బ్యాగ్రౌండ్ విడివిడిగా మ్యాప్ చేయబడుతుంది. ఇది చిత్రాలను మరింత సహజమైనదిగా మరియు ఎక్కువ శక్తివంతమైనదిగా చేస్తుంది.
ఎక్కువ సీన్లను గుర్తించడానికి
AI సీన్ రికగ్నిషన్ కొత్తది కానప్పటికీ, OPPO F11 Pro అది గుర్తించే సన్నివేశాలను పెంచడం ద్వారా ముందుకు సాగుతుంది. నైట్ సీన్ , సూర్యోదయం / సూర్యాస్తమయం, మంచు దృశ్యం, ఫుడ్ , బ్లూ స్కై , ఇండోర్, ఆకుపచ్చ గడ్డి, ప్రకృతి దృశ్యం, సముద్రతీరం, ఫైర్ వర్క్స్ , కుక్క, స్పాట్లైట్, పోర్ట్రైట్ , మల్టి -పర్సన్ చిత్రణ మరియు మరిన్ని వంటివి ఉంటాయి. దీని అర్థం, మీరు మిమ్మల్ని అనేక రకాలుగా మార్చుకోవడానికి, ఎక్కువ సీన్ లను ఈ ఫోనులో అందిస్తోంది.
ఎక్స్పీరియన్స్ దిశగా సాగిపో
యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా, OPPO F11 Pro ఫోన్ 20 నిమిషాల పాటు ఛార్జింగ్ సమయాన్ని తగ్గిస్తుంది మరియు మరింత ఛార్జింగ్ వేగాన్ని అందిస్తుంది , ఇది VOOC 3.0 సాంకేతికతను ఇందులో అందించింది. F11 సిరీస్ 4,000mAh బ్యాటరీని కలిగి ఉంది, గత తరంతో పోలిస్తే ఈ బ్యాటరీ సామర్థ్యం 14% వరకూ పెరిగింది. వినియోగదారులు సుదీర్ఘ బ్యాటరీ జీవితాన్ని ఆస్వాదిస్తారని ఇది చెబుతోంది. OPPO యొక్క అంతర్గత పరీక్షలలో, ప్రతిరోజు ఉపయోగం కోసం బ్యాటరీ 15.5 గంటల వరకు, పూర్తిగా నిరంతర వీడియో కోసం 12 గంటలు మరియు భారీ గేమ్స్ ఆడటానికి 5.5 గంటలకు ఒక పూర్తి-ఛార్జ్ పనిచేస్తుంది. హైపర్ బూస్ట్ అని పిలిచే పనితీరు స్పీడ్ ని పెంచే మరొక లక్షణం. ఈ సిస్టమ్ ఇంజన్లో మెరుగైన అనుభవాన్ని అందించటానికి సిస్టమ్, గేమింగ్ మరియు APP పనితీరును పెంచడానికి ఈ ఇంజిన్ ఒక మూడు-వైపుల విధానాన్ని ఉపయోగిస్తుంది.
దాని AI సామర్థ్యాలు మరియు ఇతర లక్షణాలకు నిజంగా మెచ్చుకోవచ్చు. OPPO F11 ప్రో దాదాపు ఎవరైనా సరే ఆకట్టుకునేలా ఫోటోలు తీసుకోవాలని చూసే వారికీ చాలా సులభంగా ఆ పనిని చేస్తుంది. కాబట్టి, మీరు ఫోటోలను తీయడం మరియు తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా గొప్ప ఫోటోలను తీయగల ఫోన్ కోసం చూస్తుంటే, OPPO F11 Pro అనేది మీరు పరిగణించవలసిన ఒక గొప్ప స్మార్ట్ ఫోనుగా ఖఛ్చితంగా చెప్పొచ్చు.