నోకియా 7.1 ప్లస్: రియర్ డ్యూయల్ – కెమెరా సెటప్ గురించి TEENA లిస్టింగ్ నిర్ధారణ

నోకియా 7.1 ప్లస్: రియర్ డ్యూయల్ – కెమెరా సెటప్ గురించి TEENA లిస్టింగ్ నిర్ధారణ
HIGHLIGHTS

గత వారం, నోకియా 7.1 ప్లస్ యొక్క వెనుక భాగపు ప్యానెల్ను చూపించే ఒక లీక్ చిత్రం, ద్వంద్వ-కెమెరా సెటప్ను చూపించే దీనిని ఉత్పాదక కర్మాగారం నుంచి తీసుకున్నట్లు ఆరోపణ.

గత వారంలో, నోకియా 7.1 ప్లస్ స్మార్ట్ఫోన్ యొక్క వెనుక ప్యానెల్ను ప్రదర్శించడానికి ఒక చిత్రం ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టింది. ఈ చిత్రం ఫ్యాక్టరీ నుండి బయటపడిందని మరియు ఒక ద్వంద్వ-కెమెరా సెటప్ చూపించిందని పేర్కొనడమైనది. ఇప్పుడు ఈ ఫోన్ TANNA పై గుర్తించబడింది, వెనుక ప్యానెల్లో రెండు కెమెరాలు కలిగి ఉండటమే కాకుండా వేలిముద్ర స్కానర్నుకూడా నిర్ధారిస్తుంది. ఈ లిస్టింగ్ కూడా స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్ల మీద కొంత దృష్టిపెట్టేలా చేసింది.

వెనుక ద్వంద్వ కెమెరా సెటప్ ఒక 12MP సెన్సార్ను కలిగి ఉంది, అలాగే ఇది మరోక 13MP సెన్సర్తో జతగా కలిసి ఉంటుంది. ముందు భాగంలో,  20MP కెమెరా యూనిట్ ఉంటుంది. స్పెక్స్ షీట్ ప్రకారం, నోకియా 7.1 ప్లస్, ఒక 6.1 అంగుళాల ప్యానెల్ 1080 x 2246 పిక్సల్స్ రిసల్యూషన్తో ఉంటుంది. ఒక ఆక్టా కోర్ CPU 2.2 GHz వద్ద క్లాక్ చేయబడింది, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 చిప్సెట్ తో ఉండవచ్చు. ఈ చిప్సెట్, 4GB  RAM / 64GB నిల్వ మరియు 6GB RAM  / 128GB నిల్వ వంటి రెండు మోడళ్లను కలిగి ఉండవచ్చు. ఈ ఫోన్ను 3,400 ఎమ్ఏహెచ్ బ్యాటరీ శక్తితో అందించనున్నారు. ఇది ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో నడుస్తుంది.

                                                                             మూలం 

గత వారం, వెల్లడైన లీక్ చిత్రం వెనుక ప్యానెల్ Android One బ్రాండింగ్ చూపించింది, అంటే ఈ స్మార్ట్ఫోన్ Google యొక్క ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్ కింద రావచ్చు అర్థం. కానీ TENAA జాబితాలోని ఫోటో Android One బ్రాండింగ్ని చూపించలేదు.

గతంలో వచ్చిన, ముందు ప్యానెల్ లీక్ నోకియా 7.1 ప్లస్ లో  నోచ్ గురించి పేర్కొలేదు, ఇది ఒక "నోచ్డ్" డిస్ప్లేను అందులో చూపించలేదు మరియు TNAA లిస్టింగ్ నుండి కూడా ఇందులో నోచ్ డిస్ప్లే ఉన్నదా లేదా అనే విషయం స్పష్టంగా తెలియదు. ఈ ఫోటోలను బహిర్గతం చేసిన యూజర్ నోకియా 7.1 ప్లస్ సన్నని పక్కవైపు బెజెల్లను కలిగి ఉండగా, టాప్ కెజెల్ కెమెరా, సామీప్య సెన్సార్లు మరియు ఇయర్పీస్ తో ఉండాలని భావిస్తున్నట్లు మరియు మందపాటి చిన్ ఉంటుంది. ఈ పరికరం 18W గల వేగవంతమైన ఛార్జింగ్ కి మద్దతు ఇస్తుందని చెప్పబడింది. ఈ పరికరాన్ని ఆరోపించిన నోకియా 9 తో లాంచ్ చేస్తారానే ఊహాగానాలు కూడా ఉన్నాయి, దీని  వెనుకభాగంలో ఒక పెంటా-కెమెరా సెటప్ను కలిగినట్లు నివేదించింది. HMD గ్లోబల్ అక్టోబర్ 4 న నోకియా 7.1 ప్లస్ ను ప్రారంభించనున్నట్లు అంచనా.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo