ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ టెక్నో యొక్క బడ్జెట్ సిరీస్ స్పార్క్ నుండి Tecno Spark Go 2024 స్మార్ట్ ఫోన్ ను విడుదల చేస్తోంది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను ఇంకా ప్రకటించలేదు కానీ కొన్ని ప్రత్యేకతల వివరాలను మాత్రం విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ను డ్యూయల్ DTS స్పీకర్స్ మరియు Dynamic Port ఫీచర్ తో లాంచ్ చేస్తున్నట్లు టెక్నో అనౌన్స్ చేసింది. టెక్నో త్వరలో లాంచ్ చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోండి.
టెక్నో స్పార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ అమేజాన్ స్పెషల్ గా లాంచ్ అవుతోంది. అందుకే, ఈ ఫోన్ స్పెక్స్ ను అమేజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా కంపెనీ రివీల్ చేసింది. అమేజాన్ అందించింది టీజర్ ప్రకారం, ఈ ఫోన్ ఐఫోన్ 15 లో వున్న డైనమిక్ ఐల్యాండ్ మాదిరిగా కనిపించే ఫీచర్ ను కలిగి వుంది. ఈ ఫీచర్ ను Dynamic Port గా పిలుస్తోంది టెక్నో.
అంతేకాదు, ఈ ఫోన్ వెనుక ఆకర్షణీయంగా కనిపించే కెమేరా బంప్ మరియు అందులో డ్యూయల్ కెమేరా సెటప్ ను అందించింది. ఈ కెమేరా సెటప్ లో 13MP AI మెయిన్ కెమేరా మరియు జతగా AI లెన్స్ ఉంటాయి. ఈ ఫోన్ లో సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 5000mAh బిగ్ బ్యాటరీ ఉన్నాయి. ఈ టెక్నో ఫోన్ Unisoc T606 ఆక్టా కోర్ ప్రోసెసర్, 6GB వరకూ ర్యామ్ (మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో కలిపి) మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
Also Read : Redmi 13C: ఆకర్షణీయమైన డిజైన్ తో కొత్త ఫోన్ లాంచ్ చేస్తున్న Xiaomi
ఈ ఫోన్ ను బడ్జెట్ ధరలోనే డ్యూయల్ DTS స్పీకర్స్ మరియు 90Hz పంచ్ హోల్ డిస్ప్లేతో తీసుకు వస్తునట్లు టెక్నో గొప్పగా చెబుతోంది. ఓవరాల్ గా ఈ అప్ కమింగ్ టక్నా స్మార్ట్ ఫోన్ చూడముచ్చటైన డిజైన్ మరియు ఆకట్టుకునే ఫీచర్స్ తో వస్తోంది. ఈ ఫోన్ ధర ను బట్టి ఈ ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న చాలా 4G స్మార్ట్ ఫోన్ లకు గట్టి పొట్టిగా మారవచ్చు.