టెక్నో నుండి మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వస్తోంది. టెక్నో బడ్జెట్ సిరీస్ గా పేరొందిన స్పార్క్ సిరీస్ నుండి Tecno Spark Go 2024 ను లాంచ్ చేస్తోంది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ త్వరలోనే లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ లాంచ్ డేట్ ను మాత్రం ఇంకా ప్రకటించ లేదు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కీలకమైన వివరాలను ముందుగానే వెల్లడించింది. అందులో, డ్యూయల్ DTS స్పీకర్స్ మరియు Dynamic Port వంటి ఫీచర్స్ ఉన్నాయి.
టెక్నో స్పార్క్ గో 2024 ఫోన్ కోసం అమేజాన్ ప్రత్యేకమైన మైక్రో సైట్ పేజ్ ద్వారా టీజింగ్ చేస్తోంది. ఈ టెక్నో ఫోన్ ను అమేజాన్ స్పెషల్ గా తీసుకు వస్తోంది. అందుకే, అమేజాన్ మైక్రో సైట్ పేజ్ ద్వారా ఈ టెక్నో ఫోన్ యొక్క స్పెక్స్ ను కంపెనీ టీజింగ్ చేస్తోంది. అమేజాన్ ఈ ఫోన్ కోసం అందించిన మైక్రో సైట్ టీజర్ ద్వారా, ఈ ఫోన్ లో ఐఫోన్ 15 ఫోన్ లో కనిపించే డైనమిక్ ఐల్యాండ్ లాగా కనిపించే మాదిరి ఫీచర్ కలిగి వుంది. ఈ ఫీచర్ ను Dynamic Port గా టెక్నో చెబుతోంది.
Also Read : Gold Price: అందనంత ఎత్తులో బంగారం ధర.!
ఈ అప్ కమింగ్ టెక్నో స్మార్ట్ ఫోన్ యొక్క మరిన్ని ఫీచర్లను కూడా టీజర్ ద్వారా వెల్లడించింది. టెక్నో స్పార్క్ గో 2024 స్మార్ట్ ఫోన్ ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు మెమొరీ ఫ్యూజన్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ టెక్నో అప్ కమింగ్ ఫోన్ 6GB* వరకు RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ను కలిగి ఉంటుంది.
టెక్నో ఈ ఫోన్ లో డ్యూయల్ DTS స్పీకర్లను అందించినట్లు కూడా ప్రకటించింది. ఈ ఫోన్ లో 13MP AI డ్యూయల్ రియర్ కెమేరా ఉన్నట్లు కూడా టీజర్ ద్వారా రివీల్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ ఉన్నట్లు కూడా టెక్నో ఈ ఫోన్ లాంచ్ కంటే ముందుగానే వెళ్ళడించింది.