ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ టెక్నో ఇండియాలో మరొక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. కేవలం రూ.6,999 ధరకే బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ తో ఈ ఫోన్ ను టెక్నో లాంచ్ చేసింది. అదే Tecno Spark GO 2023 స్మార్ట్ ఫోన్ మరియు ఈ ఫోన్ మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉన్నట్లు టెక్నో పేర్కొంది. టెక్నో విడుదల చేసిన ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ స్పెక్స్ మరియు ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దామా.
టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ ను 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ తో రూ.6,999 లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ఎండ్ లెస్ బ్లాక్, యూయిని బ్లూ మరియు నెబ్యులా పర్పల్ అనే మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది. ఈ ఫోన్ అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ లలో లభిస్తుంది.
టెక్నో స్పార్క్ గో 2023 స్మార్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ డిస్ప్లేని HD+ రిజల్యూషన్ తో కలిగి వుంటుంది. ఈ డిస్ప్లే 120Hz టచ్ శాంప్లింగ్ రేట్, 480నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు 90% స్క్రీన్ టూ బాడీ రేషియోతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ బడ్జెట్ క్వాడ్ కోర్ ప్రోసెసర్ Helio A22 తో పనిచేస్తుంది. దీనికి జతగా, 3GB ర్యామ్ మరియు 32GB స్టోరేజ్ టి ఉంటుంది.
కెమెరా విభాగంలో, ఈ ఫోన్ వెనుక AI డ్యూయల్ కెమేరా వుంది. ఇందులో 13MP ప్రైమరీ కెమేరా జతగా మరొక కెమేరా వుంది. ముందు భాగంలో, 5MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారితంగా HiOS సాఫ్ట్ వేర్ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ తో పెద్ద 5000 mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది.