టెక్నో ఇండియాలో ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ Tecno Spark Go ఫస్ట్ సేల్ రేపు మొదలవుతుంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో ఐఫోన్ ప్రీమియం ఫోన్ మాదిరిగా కనిపించే డిజైన్ తో మార్కెట్ లో అడుగుపెట్టింది. ఈ ఫోన్ ను చవక ధరలో ప్రవేశపెట్టినా 8GB ర్యామ్ మరియు డ్యూయల్ స్పీకర్లు వంటి మరిన్ని ఫీచర్స్ తో అందించింది.
టెక్నో స్పార్క్ గో స్మార్ట్ ఫోన్ ను రూ. 7,299 రూపాయల ప్రైస్ తో టెక్నో లాంచ్ చేసింది. ఈ ఫోన్ సెప్టెంబర్ 3వ తేదీ, అనగా రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి Amazon నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.
టెక్నో స్పార్క్ గో 1 స్మార్ట్ ఫోన్ చవక ధరలో వచ్చినా 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు ప్రీమియం ఫోన్ లుక్ అందించే డైనమిక్ పోర్ట్ ఫీచర్ కలిగిన 6.67 ఇంచ్ HD+ స్క్రీన్ ను కలిగి వుంది. ఈ ఫోన్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఇన్ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్ ఫీచర్ తో కూడా వస్తుంది. ఈ ఫోన్ ను Unisoc T615 ఆక్టా కోర్ చిప్ సెట్ తో అందించింది. ఈ టెక్నో కొత్త ఫోన్ 4GB ఫిజికల్ ర్యామ్ + 4GB ఎక్స్ టెండెడ్ ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
ముఖ్యంగా ఈ ఫోన్ డిజైన్ గురించి చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ ఫోన్ ను ఐఫోన్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మాదిరిగా డిజైన్ చేసింది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ ఫ్లాష్ 13MP కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లో dts సౌండ్ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు మరియు IP54 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ ఉన్నాయి.
Also Read: WhatsApp కొత్త అప్డేట్ తో మరొక గొప్ప ఫీచర్ అందిస్తోంది.!
ఈ ఫోన్ లో 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 Go OS పై నడుస్తుంది. టెక్నో స్పార్క్ గో 1 ఫోన్ ను లైమ్ గ్రీన్, స్టార్ట్రల్ బ్లాక్ మరియు గ్లిటరీ వైట్ అనే మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.