TECNO SPARK 20 PRO 5G ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది.!

Updated on 11-Jul-2024
HIGHLIGHTS

TECNO SPARK 20 PRO 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది టెక్నో

ఈ 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో బడ్జెట్ ధరలో విడుదల చేసింది

ఈ ఫోన్ డిజైన్ ఖరీదైన ఫోన్ లను తలపించేలా ఉంది

TECNO SPARK 20 PRO 5G స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది టెక్నో. ఈ 5జి స్మార్ట్ ఫోన్ ను ప్రీమియం డిజైన్ తో బడ్జెట్ ధరలో సైలెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ బడ్జెట్ స్పెక్స్ మరియు ఫీచర్స్ తో వచ్చింది. కానీ, ఈ ఫోన్ డిజైన్ మాత్రం ఖరీదైన ఫోన్ లను తలపించేలా ఉంది, అని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

TECNO SPARK 20 PRO 5G: ప్రైస్

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ స్టార్టింగ్ వేరియంట్ (8GB + 128GB) ను రూ. 15,999 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో అందించింది. ఈ ఫోన్ రెండవ వేరియంట్ (8GB + 256GB) ను రూ. 16,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ ఫోన్ పైన మంచి బ్యాంక్ ఆఫర్స్ కూడా టెక్నో అందించింది.

ఆఫర్స్:

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల ఆల్ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. అంటే, బ్యాంక్ కార్డ్ ఆప్షన్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 13,999 ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read: Soundbar Offer: 70 శాతం డిస్కౌంట్ తో రూ. 3,999 కే పవర్ ఫుల్ సౌండ్ బార్ అందుకోండి.!

TECNO SPARK 20 PRO 5G: ఫీచర్లు

టెక్నో స్పార్క్ 20 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ప్రీమియం డిజైన్ తో అందించింది. ఈ ఫోన్ వాచ్ గ్రేడ్ నానో ఎట్చ్డ్ టెక్స్చర్ కలిగిన సూపర్ ఎలిప్స్ డిజైన్ తో అందించింది. ఇది సన్నని డిజైన్, రౌండ్ కార్నర్ మరియు కర్వుడ్ బ్యాక్ తో చాలా స్టైలిష్ గా మరియు చాలా ప్రీమియం లుక్ తో కనిపిస్తుంది. ఈ ఫోన్ లో 6.78 ఇంచ్ LTPS LCD డిస్ప్లే వుంది. ఇది 60Hz – 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ మరియు డైనమిక్ పోర్ట్ 2.0 నోటిఫికేషన్ పోర్ట్ తో ఉంటుంది.

TECNO SPARK 20 PRO 5G Features

టెక్నో ఈ ఫోన్ ను Dimensity 6080 5జి చిప్ సెట్ మరియు జతగా 8GB ఫిజికల్ ర్యామ్ + 8GB మెమరీ ఫ్యూజన్ సపోర్ట్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ HiOS 14 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 14 OS పైన నడుస్తుంది.

ఈ ఫోన్ ను IP53 రేటింగ్ తో అందించింది మరియు ఇందులో 5000mAh బిగ్ బ్యాటరీ వుంది. ఈ బ్యాటరీ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos మరియు Hi-Res ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :