Tecno Pova 6 Pro: టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లాంఛ్ గురించి భారీగా టీజింగ్ చేస్తోంది. టెక్నో పోవా 6 ప్రో స్మార్ట్ ఫోన్ ను డిఫరెంట్ డిజైన్ మరియు 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తున్నట్లు ఈ ఫోన్ గురించి గొప్పగా చెబుతోంది. ఈ అప్ కమింగ్ ఫోన్ గురించి టెక్నో కొత్త విషయాలను ఈరోజు వెల్లడించింది. ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది. ఎలాంటి ఫ్యూచర్ లతో లంచ్ అవుతుందో చూద్దామా.
ఈ టెక్నో అప్కమింగ్ ఫోన్ మార్చి 29వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదలవుతుంది. ఈ టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా తీసుకువస్తుంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన మైక్రోసైట్ పేజ్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ మైక్రో సైట్ నుండి టెక్నో లాంచ్ చేయబోతున్న పోవా 6 ప్రో కీలకమైన వివరాలను అందించింది.
ఈ టెక్నో అప్ కమింగ్ ఫోన్ అప్డేటెడ్ ఇంటర్ ఫేజ్ డిజైన్ తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 100+ కస్టమ్ సెట్టింగ్స్ కలిగిన 210 Mini LED ని అందించింది. ఈ లైట్ తో ఈఫోన్ చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది.
ఈ మినీ ఎల్ఈడి గేమ్ కాల్ నోటిఫికేషన్ వంటి వచ్చినప్పుడు వెలుగుతుంది. అంతేకాదు, మరిన్ని ఫీచర్లు ఈ లైట్ తో జోడించినట్లు కంపెనీ చెబుతోంది.
Also Read: టెస్టింగ్ లో 16 Gbps స్పీడ్ నమోదు చేసిన 5G నెట్ వర్క్.. ఇదేం స్పీడ్ రా బాబు.!
టెక్నో పోవా 6 ప్రో ఫీచర్స్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్లను చూస్తుంటే, ఈ ఫోన్ భారీ వివరాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్లు 12GB ఫిజికల్ రామ్ మరియు 12GB ఎక్స్ ప్యాండబుల్ RAM తో కలిపి టోటల్ 24GB RAM ఫీచర్ తో తీసుకు వస్తునట్లు తెలిపింది.
ఈ ఫోన్ లో 8GB RAM + 8GB ఎక్స్ ప్యాండబుల్ RAM వేరియంట్ ఉన్నట్లు కూడా కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు నీ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నట్లు కూడా తెలిపింది. ఈ ఫోన్లో అద్భుతమైన డిస్ప్లేన్ ఇచ్చినట్లు కూడా కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగిన 10 AMOLED స్క్రీన్ ను 120 Hz రిఫ్రెష్ సపోర్ట్ తో కలిగి ఉన్నట్లు కూడా తెలిపింది.
70W సూపర్ ఫాస్ట్ ఛార్జ్ టెక్ సపోర్ట్ కలిగి 6000 mAh బ్యాటరీని కలిగిన మొదటి ఫోన్ గా టెక్నో పోవా 6 ప్రో నిలుస్తుందని టెక్నో వివరించింది.
ఈ ఫోన్ ను మరింత ప్రీమియం మరియు ఆకర్షణీయంగా కన్పించేలా చేయడానికి Dynamic Port 2.0 ఫీచర్ కూడా జత చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో Hi-Res Audio మరియు Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి.
ఈ ఫోన్ కెమేరా పరంగా కూడా గొప్పగానే కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ ఫోన్ లో 108MP + 2MP + AI లెన్స్ ట్రిపుల్ రియర్ మరియు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి.