Tecno Pop 9 5G స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరలో ఆకట్టుకునే ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది. టెక్నో ఇప్పుడు ఈ ఫోన్ యొక్క 8GB వేరియంట్ కూడా లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ యొక్క 8GB వేరియంట్ ధర వివరాలతో టెక్నో టీజింగ్ చేస్తోంది. ఈ ఫోన్ చాలా చవక ధరలో Sony డ్యూయల్ కెమెరా మరియు NFC వంటి మరిన్ని ఫీచర్స్ తో ఆకట్టుకుంటుంది. అయితే, ఇప్పటి వరకు ఈ ఫోన్ కేవలం 4GB వేరియంట్ తో మాత్రమే అందుబాటులో వుంది.
టెక్నో పాప్ 9 5జి స్మార్ట్ ఫోన్ జనవరి 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ ను అమెజాన్ ఇండియా ద్వారా లాంచ్ చేస్తోంది. ఈ మైక్రో సైట్ పేజ్ నుంచి ఈ ఫోన్ యొక్క ధర వివరాలు కూడా అందించింది.
టెక్నో పాప్ 9 5జి 8GB + 128GB వేరియంట్ ను 10,999 రూపాయల ధరతో లాంచ్ చేయబోతున్నట్లు టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ధర పై స్టార్ ను యాడ్ చేసింది కాబట్టి ఇది ఆఫర్ ధర అయ్యే అవకాశం వుంది.
టెక్నో పాప్ 9 5జి స్మార్ట్ ఫోన్ రౌండ్ కార్నర్స్ మరియు స్లిమ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 5G చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ ఇప్పటి వరకు 4GB + 64GB మరియు 4GB + 128GB వేరియంట్లలో విడుదల అందుబాటులో వుంది. అయితే, 8GB + 128GB వేరియంట్ కూడా వస్తోంది. ఇందులో 8GB వరకు వర్చువల్ ర్యామ్ అందించే మెమరీ ఫ్యూజన్ ఫీచర్ కూడా వుంది. అంటే, టోటల్ 16GB ర్యామ్ సపోర్ట్ తో వస్తుంది.
టెక్నో పాప్ 9 5జి ఫోన్ లో పంచ్ హోల్ డిజైన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన స్మూత్ స్క్రీన్ ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక 48MP Sony IMX582 డ్యూయల్ కెమెరా సెటప్ మరియు రింగ్ ఫ్లాష్ లైట్ వుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ స్పీకర్లు, IR బ్లాస్టర్ మరియు NFC వంటి ఆకట్టుకునే ఫీచర్స్ కూడా ఉన్నాయి.
Also Read: BSNL Best Plan 2025: నెలకు రూ. 100 ఖర్చుతో అన్ని లాభాలు అందించే బెస్ట్ ప్లాన్ ఇదే.!
ఈ ఫోన్ ను 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బ్యాటరీ సెటప్ ఉంటుంది. పాప్ 9 5జి ఫోన్ IP54 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ తో రెండు స్టైలిష్ బ్యాక్ ప్యానల్స్ ను కూడా ఉచితంగా అందుతాయి. ఈ ఫోన్ మిడ్ నైట్ షాడో, అజూర్ స్కై మరియు అరోరా క్లౌడ్ మూడు కలర్ లలో లభిస్తుంది.