Phantom V Fold 2: గొప్ప ఫీచర్స్ తో మరొక కొత్త ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తున్న Tecno.!

Updated on 02-Dec-2024
HIGHLIGHTS

Tecno ఇండియాలో మరొక కొత్త ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది

Phantom V Fold 2 స్మార్ట్ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్

అత్యంత కఠినమైన ఫోల్డ్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు టెక్నో గొప్పగా చెబుతోంది

ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ Tecno ఇండియాలో మరొక కొత్త ఫోల్డ్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, Phantom V Fold 2 స్మార్ట్ ఫోన్ మరియు ఈ అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ ను గొప్ప ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ఈ అప్ కమింగ్ టెక్నో ఫోల్డ్ ఫోన్ ను ట్రిపుల్ 50MP సూపర్ కెమెరా మరియు అత్యంత కఠినమైన ఫోల్డ్ ఫోన్ గా తీసుకొస్తున్నట్లు టెక్నో గొప్పగా చెబుతోంది.

Tecno Phantom V Fold 2: లాంచ్

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ కోసం టీజింగ్ మాత్రం మొదలు పెట్టింది. ఈ ఫోన్ అమెజాన్ స్పెషల్ గా తీసుకువస్తున్నట్లు అమెజాన్ మరియు టెక్నో ప్రకటించాయి. ఈ ఫోన్ కోసం అమెజాన్ ప్రత్యేకమైన పేజీ అందించి టీజింగ్ కూడా చేస్తోంది.

Tecno Phantom V Fold 2: కీలక ఫీచర్స్

ఈ ఫోన్ యొక్క కొన్ని కీలకమైన ఫీచర్స్ ను అందించింది. ఈ ఫోన్ ను ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా అతి పెద్ద డిస్ప్లే తో తీసుకొస్తున్నట్లు టెక్నో తెలిపింది. ఈ ఫోల్డ్ ఫోన్ స్మార్ట్ గా పని చేసేలా వీలుగా ఈ ఫోన్ ఎలా టెక్నో AI సపోర్ట్ తో అందిస్తున్నట్లు కూడా అనౌన్స్ చేసింది.

ఈ టెక్నో అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ వెనుక ట్రిపుల్ 50MP రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను ఏరో స్పేస్ గ్రేడ్ రిలయబుల్ హింజ్ డిజైన్ తో తీసుకు తీసుకు వస్తున్నట్లు కూడా టెక్నో తెలిపింది. ఈ ఫోన్ స్క్రీన్ ను అత్యంత పటిష్టమైన గ్లాస్ గా గుర్తింపు పొందిన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణతో అందిస్తుంది.

Also Read: BSNL Plan: చవక ధరలో 45 రోజులు అన్లిమిటెడ్ లాభాలు అందించే బెస్ట్ ప్లాన్.!

టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ 2 ఫోన్ ను 70W వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5,750 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ చేస్తున్నట్లు కూడా టెక్నో ప్రకటించింది. ఈ ఫోన్ లో 12GB ఫిజికల్ ర్యామ్ మరియు 12GB ఎక్స్ ప్యాండబుల్ ర్యామ్ ఫీచర్ మరియు 512GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ తో జతగా అందిస్తుంది. ఈ అప్ కమింగ్ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు మరియు డ్యూయల్ 32 MP సెల్ఫీ కెమెరా ఉన్నాయని కూడా టెక్నో కన్ఫర్మ్ చేసింది.

రానున్న రోజుల్లో ఈ ఫోన్ యొక్క మరిన్ని కీలకమైన ఫీచర్స్ మరియు లాంచ్ డేట్ ను కంపెనీ అనౌన్స్ చేస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :