Phantom V Flip 2: పెద్ద అవుటర్ స్క్రీన్ మరియు డ్యూయల్ 50MP కెమెరాతో వస్తోంది.!
టెక్నో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది
Tecno Phantom V Flip 2 లాంచ్ అనౌన్స్ చేసింది
ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది
Phantom V Flip 2: టెక్నో ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ గురించి అనౌన్స్ చేసింది. బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్ లను అందిస్తున్న టెక్నో ఇప్పుడు కూడా కొత్త ఫోన్ లను ఆకర్షణీయమైన ఫీచర్స్ తో లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. పెద్ద అవుటర్ స్క్రీన్ మరియు డ్యూయల్ 50MP కెమెరా సిస్టం తో ఈ అప్ కమింగ్ ఫ్లిప్ ఫోన్ ఫోన్ ను లాంచ్ చేస్తోంది.
Tecno Phantom V Flip 2 : లాంచ్
టెక్నో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ఫాంటమ్ వి ఫ్లిప్ 2 స్మార్ట్ ఫోన్ ను త్వరలో లాంచ్ చేస్తుందని టెక్నో తెలిపింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఈ ఫోన్ టీజింగ్ అందించింది. ఈ ఫోన్ ను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. అందుకే, అమెజాన్ ఈ ఫోన్ కోసం ప్రత్యేకమైన టీజర్ పేజీ అందించి టీజింగ్ చేస్తోంది.
Tecno Phantom V Flip 2 : ఫీచర్స్
టెక్నో ఫాంటమ్ వి ఫ్లిప్ 2 స్మార్ట్ ఫోన్ అత్యంత కఠినమైన ఏరోస్పేస్ గ్రేడ్ సూపర్ స్ట్రాంగ్ హింజ్ కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లో పెద్ద 3.2 ఇంచ్ AMOLED అవుటర్ స్క్రీన్ మరియు గొరిల్లా గ్లాస్ 6 రక్షణ కలిగిన 6.88 ఇంచ్ మడత పెట్టగలిగే AMOLED స్క్రీన్ వుంది. ఈ ఫోన్ చాలా స్లీక్ మరియు స్ట్రాంగ్ డిజైన్ ను కలిగి వుంది.
ఈ అప్ కమింగ్ ఫ్లిప్ ఫోన్ గొప్ప కెమెరా సిస్టం ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP OIS మెయిన్ కెమెరా మరియు 50MP అల్ట్రా వైడ్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 32MP సెల్ఫీ కెమెరాని కూడా కలిగి వుంది.
Also Read: Smart Tv Offer: భారీ డిస్కౌంట్ తో 24 వేల బడ్జెట్ లో లభిస్తున్న 50 ఇంచ్ స్మార్ట్ టీవీ.!
ఈ టెక్నో అప్ కమింగ్ ఫోన్ 16GB ర్యామ్ ఫీచర్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ 70W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4720 mAh బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇవి మాత్రమే కాదు బెస్ట్ AI ఫీచర్ లను కూడా ఈ ఫోన్ కలిగి ఉంటుందని టెక్నో తెలిపింది.