వన్ ప్లస్ జనవరి 7 న కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేస్తోంది. వీటిలో, OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ కూడా వుంది. వన్ ప్లస్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ యొక్క ముఖ్యమైన ఫీచర్లను ఇప్పుడు కంపెనీ రివీల్ చేసింది. వన్ ప్లస్ తీసుకురాబోతున్న ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ ను యొక్క రివీల్ చేసిన ఫీచర్ల పైన ఒక లుక్కేద్దామా.
వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన Fluid డిస్ప్లేతో వస్తుంది. ఇది ADFR 2.0 టెక్ తో కంటెంట్ కు అనుగుణంగా 40Hz, 45Hz, 60Hz, 90Hz మరియు 120Hz మధ్య మారుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ Snapdragon 8+ Gen 1 చిప్ సెట్ తో పనిచేస్తుందని కంపెనీ కన్ఫమ్ చేసింది. దీనికి జతగా 16GB ఫాస్ట్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుందని వన్ ప్లస్ పేర్కొంది.
వన్ ప్లస్ 11R 5G స్మార్ట్ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. అయితే, ఈ కెమెరాల వివరాలు మాత్రం కంపెనీ తెలియచెయ్యలేదు. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీని 100W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి వుంటుంది. ఈ ఛార్జింగ్ టెక్ తో ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 21 నిముషాల్లోనే 1-100% ఛార్జింగ్ అవుతుందని కూడా కంపెనీ టీజింగ్ చేస్తోంది. ఉత్తమ గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ ఫోన్ లో హైపర్ బూస్ట్ గేమ్ ఇంజన్ కూడా ఉన్నట్లు తెలిపింది.
ఇవన్నీ చూస్తుంటే భారీ ఫీచర్లతో ఈ OnePlus 11R 5G స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్ లో పరిచయం చేసే అవకాశం ఉంది.