2gb ర్యామ్ తో 5,999 రూ లకు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్
ఆండ్రాయిడ్ లాలిపాప్ బేస్డ్ "Freedom os" తో పనిచేస్తుంది.
Swipe బ్రాండ్ నుండి Elite మోడల్ స్మార్ట్ ఫోన్ 5,999 లకు లాంచ్ అయ్యింది. ఇది అన్ లైన్ సేల్స్ లోనే సేల్ అవుతుంది. ఫ్లిప్ కార్ట్ లో ఆగస్ట్ 19 నుండి ఫోన్ available అవుతుంది. దీనికి సొంతంగా 'Freedom OS' ఆపరేటింగ్ సిస్టం ఉంది.
Swipe ELITE స్పెసిఫికేషన్స్ – 5 in HD డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 13mp అండ్ 8mp కేమేరాస్, 2500 mah బ్యాటరీ, దీనితో పాటు 100GB క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీగా స్వైప్ బాక్స్ ఇస్తుంది.
స్వైప్ డెవలప్ చేసిన ఫ్రీడమ్ os యూజర్స్ కు మంచి custom ఆప్షన్స్ ఇస్తుంది. యాప్ సైజెస్, ఐకాన్స్, యాప్ డ్రాయర్ అన్నీ మీకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. అయితే ఇవి డిఫాల్ట్ గా os లో ఉండటం మంచి విషయం. Gestures(చేతితో ఫోన్ డిస్ప్లే పై గీతాలు గీయటం చేతితో) కూడా ఉన్నాయి. మరొక మంచి ఫీచర్ ఏంటంటే Asist X తో యూజర్ సర్వీస్ సెంటర్ వాళ్లతో ఫోన్ నుండే చాట్, కాల్ అండ్ సర్వీస్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి అనేవి తెలుసుకోవచ్చు.
కొత్త యూజర్ ఇంటర్ఫేస్ డిఫాల్ట్ గా డిఫరెంట్ ఫీచర్స్ ప్లస్ మినిమమ్ హై ఎండ్ స్పెక్స్ ను తక్కువ బడ్జెట్ లో ఇవ్వటం మాకు ఆనందం గా ఉంది అని కంపెని పెర్కుంది. అయితే ఇదే సెగ్మెంట్ లో రెడ్మి 2 prime, infocus m350 అండ్ కార్బన్ టైటానియం mach five ఉన్నాయి దీనికి పోటీగా.