ఒక ఫోన్ లో అతి ముఖ్యమైనది దానిలో బ్యాటరీ మరియు అది ప్రదర్శించే పని తనం. మీ ఫోన్ లో బ్యాటరీ ఎంత కాలం వస్తుంది.' మహా అయితే 1 రోజు , 2 రోజులు లేదా ఇంకా ఎక్కువ అంటే ఒక వారం అంతే , కానీ ఏ ఫోన్ బ్యాటరీ గురించైతే మేము చెప్పబోతున్నామో ఆ ఫోన్ యొక్క బ్యాటరీ 1 వారం కాదు 2 వారాలు కాదు దాదాపు 51 రోజులు అంటే సుమారు 2 నెలలు వస్తుంది.
అయితే ఇంత లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇచ్చే ఫోన్ ఖరీదు 60 వేలు కాదు 70 వేలు కాదు' జస్ట్ 1490రూపీస్ మాత్రమే .
జీవీ మొబైల్ కంపెనీ గత నెలలో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది.
ఈ ఫీచర్ ఫోన్ యొక్క పేరు సుమో టీ 3000 ఈ ఫోన్ యొక్క బ్యాటరీ 50-51 రోజుల స్టాండ్బై టైం ఇస్తుంది. Sumo T3000 ఫోన్ లో 2.8 ఇంచెస్ డిస్ప్లే కలిగి డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.
Sumo T3000 ఫోన్ లో3600mAh బ్యాటరీ వుంది. దీనిలో ఇంటర్నెట్ సౌకర్యం కలదు.