ఈ సింపుల్ ట్రిక్స్ తో ఇంటర్నల్ మెమరీ ఆదా చేసుకోండి
ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వటం ద్వారా నీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ సమస్య అసలు ఉందనే ఉండదు.
నేటిరోజుల్లో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ వాడటం సర్వ సాధారణమైపోయింది . కానీ ఎక్కువగా స్టోరేజ్ స్పేస్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంటే ఆ ఫోన్ వాడటానికి చాలా చిరాకు వస్తుంది. అందుకే ఈ స్టోరేజ్ ని పెంచుకోవటానికి కొన్ని సింపుల్ ట్రిక్స్ మీ కోసం ఇవ్వబడ్డాయి.
ఫస్ట్ టిప్ #
మొదట మీ ఫోన్‌లో మీకు అసలు ఉపయోగపడని యాప్స్‌ను అన్ ఇన్స్టాల్ చేస్తే సగం ఇంటర్నల్ మెమరీ సేవ్ అయినట్లే .
సెకండ్ టిప్#
ఫోన్‌లోని యాప్స్‌ను ఎస్డీ కార్డ్‌లోకి మూవ్ చేయండి . ఇలా చేయటానికి Settings > Apps > Downloaded Appsలోకి వెళ్లి ఒక్కో యాప్‌ను సెలక్ట్ చేసుకుని "move to SD card" పై టాప్ చేయండి.
థర్డ్ టిప్#
క్లీన్ మాస్టర్, క్యాచీ క్లీనర్ వంటి యాప్స్ తో క్యాచీని రిమోవ్ చేస్తే మీ ఫోన్ లో చాలావరకు ఫోన్ ఇంటర్నల్ స్పేస్ సేవ్ అవ్వగలదు .
ఫోర్థ్ టిప్#
మీ ఫోన్ లోని బ్రౌజింగ్ హిస్టరీని అస్తమాను క్లియర్ చేసుకుంటూ వుండండి.
ఫిఫ్త్ #
ఫోన్ ఇంటర్నల్ మెమురీలో స్టోర్ చేసిన ఫోటోలు, వీడియోలను ఎస్డీ కార్డులోకి మూవ్ చేయండి.
సిక్స్త్ టిప్#
ఇది అన్నికంటే ముఖ్యమైనది మీ ఫోన్‌లోని డౌన్‌లోడ్స్ ఫోల్డర్‌ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి .
ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వటం ద్వారా నీ ఫోన్ స్టోరేజ్ స్పేస్ సమస్య అసలు ఉండనే ఉండదు.