Xiaomi రీసెంట్ గా రెడ్మి 3S మరియు 3S prime అనే రెండు స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేసింది ఇండియాలో. ఇది మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఈ ఫోన్ ను మిగిలిన ఫోనులతో పోల్చటం జరిగింది కాని ఈ రెండు మోడల్స్ లో ఉన్న తేడాలు ఏంటి అని స్పష్టంగా ఎవ్వరికీ తెలియలేదు.
సో సింపుల్ గా… రెండింటిలో రామ్ మరియు స్టోరేజ్ తో పాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా డిఫరెన్స్ అని చెప్పాలి. రెడ్మి 3S(6,999 రూ ) ఫోనులో ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు. అంటే ఇప్పటికీ 6,999 బడ్జెట్ లో స్పెక్స్ వైజ్ గా కూల్ ప్యాడ్ నోట్ 3 lite నే హై రేంజ్ స్పెక్స్ ఇస్తుంది అని గమనించాలి.
రెడ్మి 3S Prime లోనే ఉంది ఫింగర్ ప్రింట్ స్కానర్. అలాగే ఇంబిల్ట్ స్టోరేజ్ విషయంలో 3S లో eMMC 5.0 flash స్టోరేజ్ ఉంటే, 3S prime లో eMMC 5.1 flash స్టోరేజ్ ఉంది. ఇక్కడ eMMC అంటే ఏదో కొత్త టెక్నాలజీ కాదు. మరియు వెర్షన్ నంబర్ కూడా పెద్ద డిఫరెన్స్ చూపించదు అని అంచనా. కానీ మీకు differences ను స్పష్టంగా తెలియజేయాలని చెప్పటం జరుగుతుంది.
మీరు ఫోన్ కొనే ప్లాన్స్ లో ఉంటే, specific గా close స్పెసిఫికేషన్స్ కొరకు కంపెని అఫీషియల్ స్పెక్స్ ను ఈ లింక్ లో చూడండి.