షావోమి రెడ్మి 6A, ఇది భారతదేశంలో రూ .7,999 ధరతో ప్రారంభించబడింది, ఇప్పుడు అమెజాన్ ద్వారా 6,499 రూపాయలకు ధరతో అమ్ముడవుతోంది. ముందువైపు 5MP సెల్ఫీ కెమేరాతో పాటు వెనుకవైపు13MP కెమెరా ఈ ఫోనులో ఉంది. ఈ సరసమైన పరికరానికి అతి సన్నిహితమైన పోటీదారులలో ఒకటిగా రియల్మీ C1 కూడా ఉంది, ఇది భారతదేశంలో సుమారు రూ .8,000 (approx) కు దగ్గరగా ఉంటుంది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను పరిమిత బడ్జెట్లో మంచి స్పెక్స్ ప్యాక్ చేస్తాయి. ఏది ఏమైనప్పటికీ, వీటిలో కాగితంపై ఇచ్చిన హార్డ్ వేర్ విషయానికి వచ్చినప్పుడు మంచిది కాదా? అని తెలుసుకోవడనికి ఈ రెండు ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
షావోమి రెడ్మి 6A, 720 × 1440 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 5.45 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, రియల్మీ C1 ఫోన్ 720 × 1520 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే కొద్దిగా పెద్దదైన ఒక 6.2-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, రియల్మి C1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ఆక్టా -కోర్ ప్రాసెసర్, 2 జీబి ర్యామ్ మరియు 32 జీబి ఇంటర్నల్ మెమెరీతో జతచేయబడింది, అయితే షావోమి రెడ్మి 6A ఒక మీడియా టెక్ హీలియో A22 చిప్సెట్, 2GB RAM మరియు 16GB అంతర్గత మెమరీతో జతచేయబడింది.
కెమెరాల విభాగంలో, రియల్మీ C1 ముందువైపు 5MP సెన్సారుతో పాటుగా వెనుకవైపు డ్యూయల్ 13MP + 2MP కెమెరా సెటప్ను కలిగి ఉంది. షావోమి రెడ్మి 6A వెనుక 13MP సెన్సార్ను కలిగి ఉంది మరియు 5MP సెల్ఫీ కెమెరాని ముందుభగంలో కలిగి ఉంటుంది.
షావోమి రెడ్మి 6A ఇప్పుడు అమెజాన్లో అందుబాటులో ఉంది, ఇది భారతదేశంలో రూ .1,400 (approx) ధర తగ్గింపుతో, సరసమైన రూ .6,499 ధరతో అమ్ముడవుతోంది. మరొక వైపు, రియల్మీ C1 2019 మోడల్ రూ .7,499 ధరతో వుంది.