స్పెక్స్ సరిపోలిక :షావోమి రెడ్మి 6 ప్రో vs మోటో వన్ పవర్

Updated on 07-Jan-2019
HIGHLIGHTS

హార్డ్వేర్ పరంగా ఏది మంచి పరికరం అనేది తెలుసుకోవటానికి క్విక్ స్పెక్స్ పోలికను చేసేద్దాం?

మోటరోలా భారతదేశంలో కొన్ని నెలల క్రితం దాని మొదటి Android One స్మార్ట్ ఫోన్ "వన్ పవర్"ను ప్రారంభించింది. ఈ ఫోన్ నోచ్ డిస్ప్లేతో వస్తుంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. మరొక వైపు, మనము షావోమి రెడ్మి 6 ప్రో కలిగివున్నాము ఇది  డ్యూయల్  కెమెరా సెటప్ తో వస్తుంది. హార్డ్వేర్ పరంగా ఏది మంచి పరికరం అనేది తెలుసుకోవటానికి క్విక్ స్పెక్స్ పోలికను చేసేద్దాం?

మోటరోలా వన్ పవర్ 1080 x 2246 పిక్సెల్స్ తో  ఒక 6.2 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ దాని డిస్ప్లే పైభగంలో ఒక నోచ్ ఉంది, ఇది ముందు భాగంలో కెమెరాని కలిగి ఉంటుంది. మరోవైపు, షావోమి రెడ్మి 6 ప్రో 1080 x 2280 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక చిన్న5.84 అంగుళాల డిస్ప్లేను కలిగివుంది.

వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, మోటరోలా వన్ పవర్ ఒక క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసర్ను కలిగి ఉంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 ప్రాసెసర్ ద్వారా షావోమి రెడ్మి 6 ప్రో మద్దతు ఇస్తుంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో పాటుగా మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించదగినది.

కెమెరాలకు సంబంధించినంతవరకు, మోటరోలా వన్ పవర్ ముందు 12MP సెన్సార్తో పాటు 16MP + 5MP వెనుక డ్యూయల్ కెమెరాలు కలిగి ఉంది, షావోమి  రెడ్మి 6 ప్రో ముందు ఒక 5MP సెన్సార్ తో వెనుక ఒక డ్యూయల్ 12MP + 5MP కెమెరా కలిగివుంది.

మీరు ఎటువంటి నిర్ధారణకు రాకముందే, ఈ మోటరోలా వన్ పవర్ గూగుల్ యొక్క 'Android One' కార్యక్రమంలో భాగంగా ఉంటుందని గుర్తుంచుకోండి, అనగా పరికరం నేరుగా Google నుండి ఇతర పరికరాల కంటే ముందుగా అప్డేట్లను అందుకుంటుంది.

మోరోలా వన్ పవర్ భారతదేశంలో రూ .15,999 కు లభిస్తుంది, షావోమి రెడ్మి 6 ప్రో  రూ .10,999 ధరతో పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :