Xiaomi Poco F1, షావోమి ద్వారా మార్కెట్లోకి వచ్చిన "ఉత్తమ రేట్ ఫ్లాగ్షిప్" పరికరం అని పిలుస్తారు. ఈ సంస్థ ఫోన్ యొక్క నూతన "ఆర్మర్డ్" ఎడిషన్ను ప్రవేశపెట్టింది, ఈ ఫోన్ దీనిలో "రియల్ కెవ్లర్ బ్లాక్" ప్యానెల్ను కలిగి ఉంది, ఇది వెనుక మాట్టే బ్లాక్ ప్లాస్టిక్ ముగింపుతో ఉన్న Poco F1 రెగ్యులర్ ఎడిషన్ నుండి దీనిని విభిన్నంగా చేస్తుంది. కేవలం డిజైన్ మాత్రమే కాదు, Poco F1 ఆర్మర్డ్ ఎడిషన్, ఒక 6GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ కలిగిన Poco F1 తో పోలిస్తే ఇది ఒక 8GB RAM మరియు 256GB అంతర్గత మెమరీ తో వస్తుంది. మరొకవైపు, కొన్ని నెలల క్రితం అంతర్గత డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసరుతో, భారతదేశంలో విడుదలైన ఫ్లాగ్షిప్ కిల్లర్ వన్ ప్లస్ 6T ను కలిగివున్నాము. కాబట్టి, తేడాను చూడడానికి ఈ రెండు స్మార్ట్ ఫోనుల యొక్క స్పెక్స్ పోల్చిచూద్దాం.
షావోమి పోకో F1 ఒక 6.18-అంగుళాల డిస్ప్లేని 1080 x 2246 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది, అయితే వన్ ప్లస్ 6T 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో కొద్దిగా పెద్దదైన ఒక 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ పైభాగంలో ఒక వాటర్ డ్రాప్ నోచ్ కలిగివుంది, ఇది ముందు భాగంలోని కెమెరాని కలిగి ఉంటుంది.
వీటి పనితీరుకు వచ్చినప్పుడు, ఈ రెండు పరికరాలు కూడా తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైనవి. వన్ ప్లస్ 6T ఒక 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీని అందిస్తుంది, ఇది 256GB వరకు విస్తరించేందుకు అవకాశమున్నది. మరొక వైపు, షావోమి పోకో F1 ఆర్మౌర్డ్ ఎడిషన్ ఒక 8GB RAM మరియు 256GB అంతర్గత మెమరీతో ప్యాక్ చేయబడింది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, షావోమి పోకో F1 ఆర్మౌర్డ్ ఎడిషన్ ముందు 20MP కెమేరా మరియు వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరాలతో ఉంటుంది. వన్ ప్లస్ 6T ఒక 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మరియు వెనుక ఒక డ్యూయల్ 16MP + 20MP కెమెరా కలిగివుంది.
వన్ ప్లస్ 6T ఇండియాలో రూ .37,999 లభిస్తుంది, అయితే షావోమి యొక్క పోకో ఆర్మౌర్డ్ ఎడిషన్ Rs 28,999 కు లభిస్తుంది.