స్పెక్స్ సరిపోలిక : షావోమి మి A2 vs రియల్మీ2 ప్రో

స్పెక్స్ సరిపోలిక : షావోమి మి A2 vs రియల్మీ2 ప్రో
HIGHLIGHTS

ఈ రెండు పరికరాలు, డ్యూయల్ కెమెరా సెటప్ మరియు FHD + డిస్ప్లే కలిగివుంటాయి.

ఈ రోజుల్లో, రూ. 15,000 ధరలో ఒక మంచి  స్మార్ట్ ఫోన్  కోసం చూస్తున్నవారికీ  చాలానే ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. షావోమి మి A2 మరియు రియల్మీ 2 ప్రో స్మార్ట్ ఫోనులు కూడా అదే 15 వేల శ్రేణి విభాగంలో ఉన్నాయి  మరియు ఒక మంచి బడ్జెట్ పరిధిలో గొప్ప లక్షణాలను పుష్కలంగా తీసుకువస్తాయి. ఈ రెండు పరికరాలు, డ్యూయల్ కెమెరా సెటప్ మరియు FHD + డిస్ప్లే కలిగివుంటాయి. అయితే, హార్డ్వేర్ పరంగా ఏ పరికరం ఉత్తమంగా ఉంటుందో, చూడడానికి వాటి స్పెక్స్ క్విక్ గా పోల్చి చూద్దాం.

Mi A2 vs RealMe 2 Pro.png

షావోమి మి A2, ఒక 5.99 అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది, అది 1080 x 2160 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది. మరొక వైపు, రియల్మి 2 ప్రో ఫోన్ 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషనుతో ఒక పెద్ద 6.3 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది. ఈ స్మార్ట్ఫోన్ పైన డ్యూ – డ్రాప్ నోచ్ ఉంది, ఇది ముందు భాగంలోని కెమెరాని కలిగి ఉంటుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, RealMe 2 Pro ఒక పెద్ద డిస్ప్లేతో వస్తుంది మరియు Xiaomi Mi A2 తో పోలిస్తే మెరుగైన రిజల్యూషన్నుఅందిస్తుంది.

వీటి పనితీరు విషయానికి వస్తే, రెండు పరికరాలు కూడా  క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్ ద్వారా ఆధారితంగా  ఉంటాయి. అయితే, షావోమి మి A2 ఒక 4GB RAM మరియు 64GB స్టోరేజితో అందుబాటులో ఉంది, అయితే రియల్మీ2 ప్రో 6GB / 128GB వేరియంట్లో వస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు అంతర్గత స్టోరేజీని కూడా పెంచుకోవచ్చు.

కెమేరాల విభగానికివస్తే, షావోమి మి A2 డ్యూయల్ 12MP + 20MP రియర్ కెమెరా మరియు  ముందు 20MP సెన్సారుతో ఏర్పాటు చేయబడింది. మరొక వైపు, రియల్మి 2 ప్రో ముందు 16MP సెన్సారుతో పాటుగా, వెనుక 16MP + 2MP డ్యూయల్  కెమెరాలతో వస్తుంది.

షావోమి మి A2 భారతదేశంలో రూ .14,999 ధరతో ఉంటుంది, మరియు రియల్మి 2 ప్రో ని రూ. 13,990ధరతో కొనుగోలుచేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo