శామ్సంగ్ భారతదేశంలో దాని M సిరీస్ లో భాగంగా రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ M10 మరియు M20 లను గొప్ప అంచనాలతో విడుదల చేయగా, గెలాక్సీ M20 కొంచెం ప్రీమియంగా ఉంటుంది. భారతదేశంలో ఈ ఫోన్ 12,990 రూపాయల ధరతో ఉంది. ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇంకొక వైపు, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 విషయానికి వస్తే, ఇది మధ్య శ్రేణి విభాగంలో గత సంవత్సరం వచ్చిన స్మార్ట్ ఫోన్లలో అత్యంత విలువైన ఫోన్లలో ఒకటిగా ఇది పేరుగాంచింది. ఈ రెండు ఫోన్లు ఒకే ధరతో దేశంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, శామ్సంగ్ తాజా స్మార్ట్ ఫోన్ అయిన గెలాక్సీ M20, ఈ అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఫోనుకు ఎంతవరకూ గట్టి పోటీని ఇస్తుందో, వాటి యొక్క స్పెక్స్ సరిపోల్చి తెలుసుకుందాం.
శామ్సంగ్ గెలాక్సీ M20 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ను అందించే ఒక 6.3-అంగుళాల పూర్తి HD + డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 1080 x 2280 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి కొద్దిగా చిన్నదైన ఒక 6.26-అంగుళాలడిస్ప్లేతో వస్తుంది.
ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ M20 ఒక Exynos 7904 ఆక్టా కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 3GB RAM మరియు 32GB అంతర్గత మెమరీతో పాటుగా 2TB వరకు మెమోరిని పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది, కానీ శామ్సంగ్ గెలాక్సీ M20 లో మాత్రం 512GB వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది.అలాగే, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 కూడా 4GB / 64GB మరియు 6GB / 128GB వేరియంట్లో అందుబాటులో ఉంది.
కెమెరాల విషయానికి వస్తే, శామ్సంగ్ గెలాక్సీ M20 సెల్ఫీ లను క్లిక్ చేయడం కోసం ముందు ఒక 8MP కెమేరాతో పాటుగా వెనుక 13MP +5MP డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇక ఆసుస్ Zenfone మాక్స్ ప్రో M2 కూడా ముందు 13MP సెన్సారుతో పాటు వెనుక డ్యూయల్ 12MP + 5MP కెమెరా ఏర్పాటుతో వస్తుంది.
శామ్సంగ్ గెలాక్సీ M20 4GB / 64GB వేరియంట్ భారతదేశంలో రూ. 12,990 ధరతో అందుబాటులో ఉండగా, అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2 యొక్క 3GB వేరియంట్ 12,999 రూపాయల ధరతో కొనుగోలుకు అందుబాటులోవుంది.