శామ్సంగ్ గెలాక్సీ M10 ఒక Exynos 7870 ఆక్టా -కోర్ ప్రాసెసర్ ఆధారితంగా మరియు వెనుక ఒక డ్యూయల్ కెమెరా సెటప్ తో ఉంది. శామ్సంగ్ భారతదేశంలో M సిరీసుతో అత్యధికమైన అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఫోన్ పైన ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో ఉంటుంది, ఇది ఈ ఫోన్ను డిజైన్ పరంగా అందమైనదిగా చేస్తుంది. మరోవైపు, రెడ్మి 6A డిజైన్ మరియు డిస్ప్లేలు పరంగా చాలా సాధారణమైన ఫోన్, అయితే రూ .6,000 ధరతో ఒక శక్తివంతమైన స్పెసిఫికేషన్లను ప్యాక్ చేస్తుంది. కాబట్టి, వీటిలో ఏది ఒక పరిమిత బడ్జెట్లో మంచి హార్డ్వేర్ను ప్యాక్ చేస్తుందో, ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లేలను సరిపోల్చడంతో ప్రారంభిద్దాం. పైన పేర్కొన్న షీట్ లో మీరు చూస్తున్నట్లుగా, ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 ఒక 6.22 అంగుళాల డిస్ప్లేను 720 x 1520 పిక్సెల్స్ రిజల్యూషనుతో అందిస్తుంది, ఇక షావోమి రెడ్మి 6A విషయానికి వస్తే, ఇది ఒక 5.45-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, ఇందులో 720 x 1440 పిక్సల్స్ రిజల్యూషన్ అందుతుంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, గెలాక్సీ M10 ఒక Exynos 7870 ఆక్టా-కోర్ ప్రాసెసర్, ఇది 2GB RAM మరియు 16GB అంతర్గత మెమరీతో జత చేయబడుతుంది, మరొకవైపు Xiaomi Redmi 6A ఒక మీడియా టెక్ హీలియో A22 చిప్సెట్ శక్తిని కలిగి ఉంటుంది, ఇది 2 జీబి ర్యామ్, 16 జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా 256 జిబి వరకు పెంచుకునే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, గెలాక్సీ M10 వెనుక 13MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగి ఉంది, ఇది ముందు 5MP సెన్సరుతో ఉంటుంది. మరొక వైపు, Xiaomi Redmi 6A ముందు 5MP సెన్సారుతో పాటుగా వెనుక 13MP సింగల్ కెమేరా యూనిట్ కలిగి ఉంటుంది.
అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 5 న గెలాక్సీ M10 భారతదేశంలో మొదటి సరిగా సేల్ కి ఉండనుంది రూ.7,999 ప్రారంభ దరతో. షావోమి రెడ్మి 6A అమెజాన్ నుండి రూ. 5,999 రూపాయలకు అందుబాటులో ఉంది.