స్పెక్స్ సరిపోలిక : శామ్సంగ్ గెలాక్సీ M10 vs శామ్సంగ్ గెలాక్సీ M20
శామ్సంగ్ నుండి సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
శామ్సంగ్ గెలాక్సీ M10 మరియు M20 రెండు కూడా, శామ్సంగ్ నుండి తాజాగా వచ్చిన బడ్జెట్ సెగ్మెంట్ డివైజులుగా చెప్పవచ్చు, వీటిని అత్యధిక స్థాయిలో అమ్మకాలను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకొనే ఉద్దేశ్యంతో ప్రారంభించబడింది. భారతదేశంలో, ఈ గెలాక్సీ M10 రూ .7,999 నుండి ప్రారంభమవుతుంది, అయితే, గెలాక్సీ M20 ధర రూ .10,999 తో, 3GB / 32GB స్టోరేజి ఎంపిక లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు, ఇన్ఫినిటీ V డిస్ప్లే మరియు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిఉంటాయి. అయితే, రెండింటి మధ్య వ్యత్యాసం, మీరు లోతుగా పరిశీలించినప్పుడు మాత్రమే తెలుసుకుంటారు. కాబట్టి, మీ అవసరాలకు అనుగుణంగా ఏ స్మార్ట్ ఫోన్ మీకు సరైన ఎంపిక అని తెలుసుకోవటానికివీటి స్పెక్స్ సరిపోల్చి చూద్దాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ల యొక్క డిస్ప్లే లను గమనిస్తే, శామ్సంగ్ గెలాక్సీ M10 ఒక 6.2-అంగుళాల HD + డిస్ప్లేను 720 x 1520 పిక్సెల్స్ తో కలిగివుంటుంది, ఇక శామ్సంగ్ గెలాక్సీ M20 ఒక 6.3-అంగుళాల FHD + ఇన్ఫినిటీ V డిస్ప్లేని 1080 x 2340 పిక్సెళ్లతో విడుదల చేస్తుంది. డిస్ప్లే పరంగా, గెలాక్సీ M20 పేపర్ పైన ఇచ్చిన వివరాల ప్రకారంగా చూస్తే, గెలాక్సీ M10 కంటే చాలా బాగుంది.
గెలాక్సీ M10 ఒక Exynos 7870 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంది, ఇది 2GB RAM మరియు 32GB అంతర్గత మెమరీతో పాటుగా మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు విస్తరించగల సామర్ధ్యాన్ని కలిగివుంటుంది. గెలాక్సీ M20 కూడా 3GB / 32GB స్టోరేజి నమూనాలో లభిస్తుంది, ఇది 10,990 రూపాయల ధరకే ఉంటుంది. మరొక వైపు, శామ్సంగ్ గెలాక్సీ M20 Exynos 7885 ఆక్టా-కోర్ ప్రాసెసర్ మద్దత్తుతో ఉంది, ఇది గెలాక్సీ M10 లో 7870 కంటే వేగంగా ఉంటుంది. ఈ ఫోన్ను 3GB / 32GB మరియు 4GB / 64GB నిల్వ మోడల్లలో అందించారు.
కెమెరాలకు సంబంధించినంతవరకు, 13MP + 5MP డ్యూయల్ వెనుక కెమెరాతో వస్తాయి. ఈ సారి, ఒక ప్రధాన 13MP సెన్సారుతో పాటు, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను శామ్సంగ్ సిద్ధంచేసింది. వెనుకవైపు ఉన్న 5MP కెమేరా యూనిట్, వైడ్ -యాంగిల్ షాట్లు తీయడానికి ఉపయోగించబడుతుంది.
వీటి బ్యాటరీ విషయానికి వస్తే, గెలాక్సీ M10 3,400mAh బ్యాటరీతో వస్తుంది. అయితే, ఇది వేగవంతంమైన ఛార్జింగ్ కు మద్దతు ఇవ్వదు. మరోవైపు, గెలాక్సీ M20 5,000 mAh బ్యాటరీతో వేగవంతమైన ఛార్జింగుకు మద్దతు ఇస్తుంది మరియు USB టైప్-సి తో వస్తుంది. సంస్థ ప్రకారం, ఈ ఫోన్ యొక్క వేగవంతమైన ఛార్జింగ్ 10 నిమిషాల్లో మీకు 3 గంటల వీడియో ప్లేబ్యాక్ మరియు 11 గంటల ఆడియో అందిస్తుందని చెబుతుంది.
గాలక్సీ M10 మరియు M20 రెండు కూడా, అమెజాన్ ద్వారా ఫిబ్రవరి 5 న భారతదేశంలో మొదటి సారి అమ్మకానికి వుండనున్నాయి. M10 2GB / 16GB వేరియంట్ రూ .7,999, 3GB / 32GB మోడల్ రూ .10,999 ధరతో ఉంటాయి. మరోవైపు, మీరు గెలాక్సీ M20 ను కొనుగోలు చేయాలంటే, మీరు 3GB / 32GB మోడల్ కోసం రూ .10,990 మరియు రూ .12,990 ధరను 4GB / 64GB వేరియంట్ కోసం ఖర్చుచేయాల్సి ఉంటుంది.