స్పెక్స్ సరిపోలిక : శామ్సంగ్ గెలాక్సీ M10 vs రియల్మీ C1
బడ్జెట్ పరిధిలో కొత్తగా వచ్చిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
ఇటీవలే, శామ్సంగ్ గెలాక్సీ M10 భారతదేశంలో ప్రారంభించబడి మరియు ఇప్పుడు Amazon.in నుండి ఇది రూ. 7,990 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్,ఇండియాలో మాత్రమే అందుతులో ఉంటుంది మరియు ఇది ఒక మంచి బడ్జెట్ ఫోన్ శామ్సంగ్ తీసుకువచ్చింది. ఇంకొక వైపు, మనకు దాదాపుగా శామ్సంగ్ గెలాక్సీ M10 యొక్క ధరపరిధిలో అందుబాటులో వుండే రియల్మీ C1 ఉంది, ఇది కూడా మంచి బడ్జెట్ పరిధిలో వస్తూంది మరియు flipkart.in నుండి కేవలం రూ.7,499 ధరతో అందుబాటులో ఉంటుంది. కాబట్టి, హార్డ్వేర్ విషయానికి వస్తే ఏది ఉత్తమమైనదిగా ఉంటుందో తెలుసువడానికి పూర్తి స్పెసిఫికేషన్లను సరిపోల్చి చూద్దాం.
పైన తెలిపిన విధంగా, శామ్సంగ్ గెలాక్సీ M10 720 x 1520 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే, ఒక 6.2 – అంగుళాల డిస్ప్లే తో వస్తుంది.అలాగే, ఈ సారి శామ్సంగ్ ఈ గెలాక్సీ M10 ని ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లేతో అందించింది. మరొక వైపు, రియల్మీ C1 కూడా 720 x 1520 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే, ఒక 6.2 – అంగుళాల డిస్ప్లే తో గెలాక్సీ M10 వలెనే వస్తుంది. కానీ,ఈ రియల్మీ C1 డిస్ప్లేలో ఒక సాంప్రదాయమైన నోచ్ మాత్రమే ఉంటుంది. ఈ విభాగంలో, శామ్సంగ్ గెలాక్సీ M10 ఎంపికలో ముందుంటుందని చెప్పొచ్చు.
వాటి ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 ఒక ఎక్సినోస్ 7870 చిప్సెట్ జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజి శక్తితో వస్తే, రియల్మీ C1 మాత్రం క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్ ద్వారా కొంచం వెనకబడి ఉంటుంది మరియు ఇది కూడా 2GB RAM మరియు 16GB అంతర్గత మెమరీతో జత చెయ్యబడింది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, శామ్సంగ్ గెలాక్సీ M10 వెనుక 13MP + 5MP డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ ఏర్పాటుతో వస్తుంది. ఇక రియల్మీ C1 విషయానికి వస్తే వెనుక ఒక 13MP+2MP యూనిట్ తో వస్తుంది మరియు ముందు 5MP కెమెరాని కలిగివుంది. అంటే, కెమేరాల విభగంలో కూడా ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 కొంచెం మంచి సెటప్ కలిగి ఉంటుందని చెప్పవచ్చు.
శామ్సంగ్ గెలాక్సీ M10 యొక్క 2GB+16GB వేరియంట్ ఇండియాలో రూ. 7,990 ధరతో Amazon.in నుండి అందుబాటులో ఉంటుంది. ఇక రియల్మీ C1 యొక్క 2GB+16GB వేరియంట్ Flipkart నుండి రూ .7,499 ధరతో పొందవచ్చు.