స్పెక్స్ సరిపోలిక : రియల్మీ U1 vs షావోమి రెడ్మి నోట్ 6 ప్రో
ఈ రోజు మనం, సరికొత్తగా మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ రెండు స్మార్ట్ ఫోన్లను పోల్చి చూద్దాం.
U సిరీస్ నుండి విడుదలైన మొదటి స్మార్ట్ ఫోన్ ఈ రియల్మీ U1. ఈ స్మార్ట్ ఫోను 25MP కెమెరా ముందు భాగంలో అందించబడింది మరియు ఒక వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. మరో వైపు, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో, ముందు మరియు వెనుక ఒక డ్యూయల్ కెమెరా సెటప్ తో షావోమి యొక్క మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ను భారతదేశంలో ఇటీవల విడుదల చేసింది రూ.13,999 ధరతో. కాబట్టి, ఈ ఫోన్ల యొక్క ఆన్ పేపర్ వివరాలతో పోల్చితే ఉత్తమమైన ప్రత్యేకతలు ఏది అందిస్తుందో చూడాల్సిన పోలికతో ప్రారంభిద్దాం.
ముందుగా, ఈ రెండు స్మార్ట్ ఫోనుల డిస్ప్లేలను సరిపోల్చడంతో ప్రారంభిద్దాం. 1080 x 2340 పిక్సెళ్లతో ఈ రియల్మీ U1 ఒక 6.3 అంగుళాల డిస్ప్లే తో ఉంటుంది, అయితే షావోమి రెడీమి నోట్ 6 ప్రో, 1080 x 2280 పిక్సెళ్ల యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.26 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.
వీటి యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ రియల్ మీ U1, ఈ స్మార్ట్ ఫోనుతో మొట్టమొదటిసారిగా మీడియాటెక్ హీలియో P70 ని ప్రపంచనికి పరిచేయం చేసింది. ఇక మరొకవైపున, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ మద్దతుతో పనిచేస్తుంది.
కెమేరా విభానికి వస్తే , ఈ రియల్మీ U1 ఒక 13MP + 2MP డ్యూయల్ రియర్ కెమేరా మరియు ముందుభాగంలో 25MP సెన్సారుతో ఉంటుంది. మరోవైపు, షావోమి ముందు మరియు వెనుక కూడా డ్యూయల్ కెమెరాలతో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ముందు ఒక 20MP + 5MP డ్యూయల్ కెమేరా మరియు వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమేరాని కలిగివుంది.
రియల్మీ U1 ఇండియాలో రూ. 11,999 ధరతో విదుదల చేయబడింది, అలాగే షావోమి రెడ్మి నోట్ 6 ప్రో రూ. 13,999 ధరతో కొనుగోలు చేయవచ్చు.