స్పెక్స్ సరిపోలిక : ఒప్పో K1 vs ఒప్పో F9 ప్రో

Updated on 07-Feb-2019
HIGHLIGHTS

ఒప్పో నుండి ప్రత్యేకంగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం

మార్కెట్లో ప్రస్తుతం, Oppo K1 స్మార్ట్ ఫోన్ డిస్ప్లేలో వేలిముద్ర సెన్సార్ కలిగిన అత్యంత సరసమైన ఫోనుగా ఉంటుంది. ఈ ఫోన్ ఒక పెద్దదైన 6.4-అంగుళాల FHD + డిస్ప్లే  పైన ఉన్న వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇక దీన్ని దాదాపు అదే డిజైన్ కలిగి మరియు, సూపర్-ఫాస్ట్ Vooc సాంకేతిక మద్దతుతో కంపెనీ ప్రకారం కేవలం 5 నిముషాల ఛార్జ్ తో,  2 గంటల వరకు టాక్ టైమ్ అందించగలిగే, మధ్యస్థాయి విభాగంలో మరోక  డివైజ్ అయినటువంటి Oppo F9 ప్రో తో సరిపోల్చనున్నాము. వీటి హార్డ్వేర్ విషయానికి వస్తే Oppo F9 ప్రో కంటే ఈ Oppo K1 మెరుగైన ఎంపిక అవుతుందా, కాదా అని చూద్దాం.

Oppo K1 2340 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక పెద్ద 6.4-అంగుళాల డిస్ప్లేను అందిస్తుంది. ఈ డిస్ప్లేలో ఒక చిన్న డ్రూ డ్రాప్ ఉంది, ఇది 25MP ముందు కెమెరాని కలిగి ఉంటుంది. Oppo F9 ప్రో యొక్క 2340 x 1080 పిక్సెళ్ళతో,  Oppo K1 అందించే అదే స్పష్టత అందిస్తుంది కానీ ఇది కొద్దిగా చిన్నదైన ఒక 6.3-అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది.

ఇక వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, Oppo K1  ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ జతగా 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ శక్తితో వస్తుంది. ఇప్పుడు, ఈ ఫోన్ కేవలం 4GB / 64GB స్టోరేజి వేరియంట్ మాత్రమే ప్రారంభించబడింది. మరోవైపు, Oppo F9 ప్రో ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించదగిన ఇది 6GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ తో జతగా ఒక మీడియా టెక్ హీలియో P70 చిప్సెట్ తో వస్తుంది. ఈ Oppo F9 ప్రో, 6GB / 64GB మరియు 6GB / 128GB స్టోరేజి వాటి రెండు వేరియంట్లలో వస్తుంది.

కెమెరాల గురించి చూస్తే, ఈ రెండు సామ్రాట్ ఫోనులు కూడా వెనుక డ్యూయల్ 16MP + 2MP కెమెరా సెటప్ తో వస్తాయి. ఈ రెండు ఫోన్లలో కూడా ముందు ఒక  25MP సెన్సార్ , సెల్ఫీలు క్లిక్ చేయడం కోసం అందించడబడించి.

Oppo F9 ప్రో రూ 21.990 ప్రారంభదరతో ఉంటుంది,ఇక Oppo K1 గురించి చూస్తే ఇది రూ 16.990 ధరతో భారతదేశం విడుదలైనది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :