స్పెక్స్ సరిపోలిక : ఒప్పో R17 vs ఒప్పోF9 ప్రో

స్పెక్స్ సరిపోలిక : ఒప్పో R17 vs ఒప్పోF9 ప్రో
HIGHLIGHTS

ఒప్పో యొక్క ఈ రెండు బెస్ట్ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 610 ప్రాసెసరుతో Oppo R17 ని విడుదలచేసింది, ఇది 8GB RAM తో జత చేయబడింది. ఈ పరికరం భారతదేశంలో రూ. 34,990 ధరతో ఉంటుంది. మరొక వైపు, Oppo F9 Pro స్మార్ట్ ఫోన్ డిస్ప్లే పైభాగంలో ఒక Teardrop Notch తో మార్కెట్లోకి తీసుకువచ్చిన కంపెనీ యొక్క మరొక మధ్యస్థాయి ప్రీమియం ఫోన్. ఈ రోజుమనం, ఈ Oppo F17 Pro ఫోన్నీ Oppo R17 తో పోల్చుతున్నాము, మీరు మీకోసం ఒక మిడ్ రేంజ్ ఫోన్ కొనడానికి ఆలోచిస్తుంటే,  మీకు  ఈ రెండుఫోన్ల  స్పెక్స్ సరిపోలిక, ఒక నిర్ణయం తీసుకోవడంలో మీకు సహాయపడవచ్చు. 

Oppo R17 vs Oppo F9 Pro.png

Oppo R17 ఫోన్,  2340 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను కలిగివున్న ఒక పెద్ద 6.4 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది, అయితే Oppo F9 Pro మాత్రం 2340 x 1080 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే కొద్దిగా చిన్నదైన ఒక 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగివుంది.

వీటి ప్రాసెసర్ల విషయానికి వచ్చినపుడు, ఈ ఒప్పోR17  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 670 ఆక్టా-కోర్ ప్రాసెసర్ చేత శక్తిని అందిస్తుంది, ఇది 2.9GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. మరొక వైపు, ఒప్పో F9 ప్రో ఒక మీడియా టీక్ హీలియో P60 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది, ఇది 6GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతచేయబడుతుంది.

కెమెరాలకు సంబంధించినంతవరకు, ఒప్పో R17 డ్యూయల్ 16MP + 5MP వెనుక కెమెరాలతో పాటుగా ముందుభాగంలో ఒక 25MP  సెన్సార్ను కలిగివుంది. ఒప్పో F9 ప్రో ముందు 25MP యూనిట్ తో వెనుక ఏర్పాటుచేయబడిన ఒక  16MP + 2MP డ్యూయల్ కెమెరాతో వస్తుంది.

Oppo R17 భారతదేశంలో రూ. 34,990 ధరతో ఉంటే, Oppo F9 ప్రో రూ .21,990 ధరతో కొనుగోలుచేయవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo