స్పెసిఫికేషన్స్ సరిపోలిక : ఒప్పో R17 ప్రో vs వన్ ప్లస్ 6T
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తాయి.
డిసెంబర్ 4 న, ఒప్పో భారతదేశం లో తన ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో Oppo R17 Pro స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా – కోర్ ప్రాసెసర్ తో వస్తుంది మరియు వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇంకొక వైపు, OnePlus 6T లో కూడా డిస్ప్లే లో ఒక వేలిముద్ర సెన్సార్ మరియు డ్యూయల్ వెనుక కెమెరాతో వస్తుంది. ఈ రెండింటి స్పెసిఫికేషన్ల పోలికను చూద్దాం, వీటిలో ఏది మంచి హార్డువేర్ను కలిగివుంటుందో?
ఈ ఫోన్ల డిస్ప్లేల విషయానికి వచ్చినప్పుడు, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 1080 x 2340 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే 6.4 అంగుళాల డిస్ప్లేతో వస్తాయి.
వీటి ప్రాసెసర్లను చూస్తే, వన్ ప్లస్ 6T తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసరుతో వస్తుంది, మరియు ఈ ప్రాసెసర్ ఒప్పో R17 ప్రో లోవున్నా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ కంటే వేగంగా ఉంటుంది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, ఒప్పో R17 ప్రో వెనుక ఒక ట్రిపుల్ 12MP + 20MP + TOF 3D సెన్సింగ్ కెమెరాను కలిగి ఉంది. TOF కెమెరా మీరు ఖచ్చితంగా 3 మీటర్ల దూరం లోపల వస్తువులను మ్యాప్ చేయడానికి అనుమతిస్తుంది. ముందు, ఇది 25MP షూటర్ ఉంది. వన్ ప్లస్ 6T విషయానికి వస్తే, ఈ ఫోనులో ముందు ఒక 16MP సెన్సార్ మరియు వెనుక డ్యూయల్ 16MP + 20MP వెనుక కెమెరా కలిగి ఉంటుంది.
ఒప్పో R17 ప్రో 8GB / 128GB వేరియంట్ భారతదేశంలో రూ 45,990 ధరతో ఉంటుంది, అలాగే వన్ ప్లస్ 6T ను రూ .37,999 ధరతో పొందవచ్చు.