స్పెక్స్ సరిపోలిక : ఒప్పో K1 vs షావోమి రెడ్మి నోట్ 7

Updated on 08-Feb-2019
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్ల గురించి ఎక్కువగా అంచనా వేస్తున్నారు కాబట్టి సరిపోల్చి చూద్దాం.

చైనీస్ స్మార్ట్ ఫోన్ తయారీదారైన  "Oppo"  కొత్తగా ప్రారంభించిన Oppo K1 డిస్ప్లేయలో ఒక వేలిముద్ర సెన్సార్ కలిగి, మార్కెట్లో అత్యంత సరసమైన డివైజ్ గా ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ .16,990. ఇంకొక వైపు, మనకు త్వరలో ఇండియాలోకి రానున్నట్లు అంచావేస్తున్న షావోమి రెడ్మి నోట్ 7 గురించి చుస్తే, ఇది ఈ నెలలో భారతదేశంలో అరంగేట్రం చేస్తుందని అందరూ భావిస్తున్నారు. ఈ షావోమి రెడ్మి నోట్ 7 యొక్క కీ హైలైట్ గా దాని వెనుక వుండే 48MP కెమెరాగా చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన ఈ Oppo K1 త్వరలో రానున్న ఈ షావోమి యొక్క తాజా డివైజ్ కి  ఒక కఠినమైన పోటీ ఇవ్వగలదో లేదో వాటి స్పెక్స్ సరిపోల్చి  చూద్దాం? .

Oppo K1 చాలా పెద్దదైన  ఒక 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది పైన ఉన్న ఒక డ్యూ-డ్రాప్ నోచ్ తో వస్తుంది. ఇది 2340 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే FHD + డిస్ప్లేని కలిగి ఉంది. మరొక వైపు, మనకు షావోమి రెడ్మి నోట్ 7 కూడా Oppo K1 అందించే అదే 2340 x 1080 పిక్సెల్స్, యొక్క రిజల్యూషన్ అందిస్తుంది, కానీ  కొద్దిగా చిన్నదైన ఒక 6.3-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది.

ఇది ప్రాసెసర్ల  గురించి చూస్తే, Oppo K1 2.2GHz వద్ద క్లాక్ చేయబడిన, ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 ఆక్టా -కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీని కలిగి ఉంది, ఒక మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు దీని స్టోరేజిని విస్తరించవచ్చు. ఒక షావోమి రెడ్మి నోట్ 7 విషయానికి వస్తే  ఇది కూడా 2.2GHz వద్ద క్లాక్ చేయబడిన అదే క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్  660 ప్రాసెసర్ కలిగి ఉంది. ఈ ఫోన్ 3GB / 32GB, 4GB / 64GB, మరియు 6GB / 64GB స్టోరేజి వంటి మూడు వేరియంట్లతో ఇండియాలో విడుదలకావచ్చని భావిస్తున్నారు.

కెమేరాల విభాగంలో,  Oppo K1 డ్యూయల్ 16MP + 2MP వెనుక కెమెరాలు కలిగివుంది. ఈ సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్,  సెల్ఫీలను క్లిక్ చేయడానికి ముందు 25MP సెన్సార్ను కలిగి ఉంటుంది. మరోవైపు, షావోమి రెడ్మి నోట్ 7 వెనుక 48MP సెన్సార్ను కలిగి ఉన్న షావోమి యొక్క మొదటి పరికరం, ఇది 5MP డెప్త్ సెన్సారుతో కలిసి ఉంటుంది. ముందు, ఈ ఫోన్ ఒక 13MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది.

షావోమి రెడ్మి నోట్ 7 యొక్క 4GB వేరియంట్ చైనాలో CNY 1,399 వద్ద ప్రారంభించబడింది, ఇది సుమారుగా రూ .14,600 రూపాయలకు సమానంగా ఉంటుంది. ఈ ఫోన్ ఫిబ్రవరిలో భారతదేశంలో ప్రవేశించవచ్చని భావిస్తున్నారు. ఏదేమైనా, కంపెనీ దీని గురించి ఇంకా ఎటువంటి నిర్ధారణ ఇవ్వలేదు. మరో వైపు, Oppo K1 Rs. 16,990 ధరతో భారతదేశం

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :