స్పెక్స్ సరిపోలిక :ఒప్పో K1 vs షావోమి రెడ్మి నోట్ 6 ప్రో
మంచి కెమేరా ఫీచర్లతో వుండే ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం
Oppo గత సంవత్సరం అనేక మధ్య స్థాయి సెగ్మెంట్ స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది. ఇప్పుడు, Oppo 2019 సంవత్సరంలో భారతదేశంలో "K1" ను మొదటిగా విడుదల చేయడానికి టైం సెట్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంది మరియు ముందు భాగంలో 25MP సెన్సారుతో వస్తుంది. మరొక వైపు, షావోమి యొక్క రెడ్మి నోట్ 6 ప్రో, మొత్తంగా నాలుగు కెమెరాలు కలిగిన చైనీస్ సంస్థ యొక్క మొదటి స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ఇది – వెనుక రెండు మరియు ముందు రెండు కెమెరాలను కలిగివుంటుంది. ఈ రెండు సామ్రాట్ ఫోన్లను స్పెక్స్ పరంగా సరిపోల్చి ఏ ఫోన్ ఒక మంచి హార్డువేర్ ప్యాక్ చేస్తుందో చూద్దాం.
షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ఒక 6.26 అంగుళాల FHD + డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 1080 x 2280 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది, అయితే Oppo K1 1080 x 2340 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే కొద్దిగా పెద్దధైన ఒక 6.4 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, Oppo K1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసర్, అలాగే 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్ మద్దతు ఇస్తుంది, ఇది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది.
కెమెరాలకు సంబంధించినంతవరకు, Oppo K1 ముందువైపు 25MP సెన్సారుతో పాటుగా వెనుకవైపు డ్యూయల్ 16MP + 2MP కెమెరా సెటప్పును కలిగి ఉంది. అలాగే, షావోమి రెడ్మి నోట్ 6 ప్రో ముందు డ్యూయల్ 20MP + 2MP కెమెరా సెటప్ తో పాటుగా వెనుక కూడా డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరాలు కలిగి ఉంది.
Oppo K1 ఫిబ్రవరి 6 న భారతదేశం లో విడుదలవ్వనుంది , కానీ షావోమి రెడ్మి నోట్ 6 ప్రో Rs 13,999 ధర వద్ద భారతదేశంలో అందుబాటులో ఉంది.