స్పెసిఫికేషన్ కంపారిజన్ : నోకియా 5.1 ప్లస్ vs మోటోరోలా వన్ పవర్

Updated on 26-Nov-2018
HIGHLIGHTS

నేడు, మేనము Android One కార్యక్రమంలో భాగమైన, నోకియా 5.1 ప్లస్ ను మోటోరోలా వన్ పవర్ తో పోల్చి చుడనున్నాము. ఇవి ఇతర వాటి కంటే ఎలాంటి మెరుగైన లక్షణాలు కలిగి ఉన్నాయో?

ఇటీవలే, మోటరోలా ఇండియాలో  తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అయినటువంటి మోటరోలా వన్ పవర్ విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్  ఒక 6.2 అంగుళాల FHD + డిస్ప్లేతో వస్తుంది మరియు డ్యూయల్ వెనుక కెమెరా సెటప్ కూడా కలిగిఉంది. మరొక వైపు, గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ లో  భాగమైన నోకియా 5.1 ప్లస్, డిస్ప్లే పైన నోచ్ కలిగి వస్తుంది మరియు రూ .10,999 ధరతో ఉంటుంది. ఈ Android One ధ్రువీకరణ కలిగిన ఈ పరికరాలు,  ఎటువంటి మెరుగైన హార్డ్వేర్  అమరికతో  వస్తుంది చూడటానికి ఈ పరికరాల యొక్క వివరాలను సరిపోల్చడం జరిగింది.

మోటరోలా వన్ పవర్ ఒక పెద్ద డిస్ప్లేని కలిగి ఉంది, ఇది 6.20 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంది, అయితే నోకియా 5.1 ప్లస్ 5.80 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఇదిలా ఉంటే,  1580 x 720 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ని అందించే నోకియా 5.1 ప్లస్తో పోలిస్తే, మోటరోలా వన్ పవర్ కూడా 1080 x 2260 పిక్సెల్స్తో మంచి రిజల్యూషన్ అందిస్తుంది.

ప్రాసెసర్ విషయానికి వస్తే, నోకియా 5.1 ప్లస్ ఒక మీడియా టెక్ హీలియో పి 60 ఆక్టా-కోర్ ప్రాసెసరుతో ఉంటుంది, ఇది 3GB ర్యామ్ మరియు 32GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, మోటరోలా వన్ పవర్ 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమరీతో క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 636 ప్రాసెసరుతో మద్దతు ఇస్తుంది. కెమెరాల విభాగంలో, మోటరోలా వన్ పవర్ ముందువైపు 12MP యూనిట్ మరియు వెనుక ఒక డ్యూయల్ 16MP + 5MP కెమెరాను కలిగి ఉంది. నోకియా 5.1 ప్లస్ డ్యూయల్ 13MP + 5MP వెనుక కెమెరా మరియు ముందు 8MP సెన్సార్ కలిగి ఉంది.

మొత్తంమీద, నోకియా 5.1 ప్లస్ తో  పోలిస్తే, మోటరోలా వన్ పవర్ ఫోన్ ఆన్ పేపర్ బాగా కనిపిస్తుంది. అయితే, నోకియా 5.1 ప్లస్ మోరోలా వన్ పవర్ కంటే చాల తక్కువ ధరకు లభిస్తుంది ఇండియాలో.  , 
నోకియా 5.1 ప్లస్  ధర – రూ .10,999
మోటరోలా వన్ పవర్ ధర –  రూ .15,999

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :