ఇటీవలే, ఈ నోకియా 8.1 స్మార్ట్ ఫోన్ ప్రారంభించబడింది మరియు ఈ రోజునుండి అమేజాన్ ఇండియాలో మొదటిసారిగా అమ్మకాలను మొదలుపెట్టింది. ఈ ఫోన్ ఒక స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగి రూ. 26,999 ధరతో ఉంటుంది. మరోవైపున, అత్యంత పాపులర్ ఫ్లాగ్స్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 6T ప్రస్తుత హై ఎండ్ చిప్సెట్ అయినటువంటి స్నాప్ డ్రాగన్ 845 తో ఉంటుంది. కాబట్టి, ఈ నోకియా 8.1 ఫోన్ వన్ ప్లస్ 6T కి ఎంతవరకు పోటీనిస్తుందో సరిపోల్చిచూద్దాం.
ఈ నోకియా 8.1 ఒక 6.18 అంగుళాల డిస్ప్లేని 1080x 2284 పిక్సెల్స్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ తన డిస్ప్లే యొక్క పై భాగంలో ఒక సెల్ఫీ కెమేరా మరియు స్పీకర్ ఇముడ్చుకున్న ఒక సంప్రదాయ నోచ్ కలిగివుంది. మరొకవైపు, వన్ ప్లస్ 6T ఒక సన్నని వాటర్ డ్రాప్ నోచ్ తో ఉంటుంది మరియు దీని ద్వారా అధిగ వీక్షణా స్థలాన్ని కలిగివుంటుంది.
పనితీరు విషయానికివస్తే, ఈ నోకియా 8.1 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసర్ కలిగివుంటే, మరొకవైపు వన్ ప్లస్ 6T అధిక స్థాయి ప్రాసెసర్ అయినటువంటి క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ కలిగి ఉంటుంది. ఈ విభాగంలో వన్ ప్లస్ 6T స్మార్ట్ ఫోనుదే పూర్తిగా పైచేయి అవుతుంది.
వన్ ప్లస్ 6T ఫోన్ ఒక 6GB ర్యామ్ మరియు 128 GB అంతర్గత మెమొరీతో వస్తుంది. దీని స్టోరేజిని మైక్రో SD కార్డుతో 256GB వరకు విస్తరించుకోవచ్చు. అయితే, ఈ నోకియా 8.1 ఫోన్ ఒక 4GB ర్యామ్ మరియు 64 GB అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు దీని స్టోరేజిని మైక్రో SD కార్డుతో 400GB వరకు విస్తరించుకోవచ్చు .
ఇక కెమేరాల విభాగానికివస్తే, నోకియా 8.1 ఒక 12+13 MP డ్యూయల్ వెనుక కెమేరా మరియు ముందు 20 MP తో వస్తుంది, అయితే వన్ ప్లస్ 6T ని చూస్తే వెనుక 16+12MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 16 MP సెల్ఫీ కెమేరాని కలివుంటుంది.
అయితే, నోకియా 8.1 బాక్స్ నుండి బయటకువస్తూనే సరికొత్త Android 9.1 Pie తో నడుస్తుంది. మరొకవైపు, వన్ ప్లస్ 6T స్మార్ట్ ఫోన్ Android 9.1 Pie అప్డేట్ చేసుకునే అవకాశంతో ఉంటుంది.
నోకియా 8.1 ఈ రోజునుండి అమేజాన్ ఇండియా ద్వారా రూ. 26,999 ధరతో అమ్మకానికి ఉంటుంది. మరొకవైపు, వన్ ప్లస్ 6T స్మార్ట్ ఫోన్ను రూ. 37,999 ధరతో కనుగోలు చేయవచ్చు.