స్పెక్స్ సరిపోలిక : నోకియా 8.1 vs హానర్ వ్యూ 20

Updated on 08-Feb-2019
HIGHLIGHTS

ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో హార్డ్ వేర్ పరంగా ఏది గొప్పగా ఉంటుందో సరిపోల్చి తెలుసుకుందాం

HMD గ్లోబల్  నుండి డిసెంబరులో భారతదేశంలో ప్రవేశపెట్టబడిన, నోకియా 8.1 రూ. 26,999 ధరతో  అమేజాన్ ఇండియా నుండి అమ్మకానికి అందుబాటులో వుంది.  ఈ స్మార్ట్ ఫోన్, ముందు ఒక 20MP సెల్ఫీ కెమెరా మరియు ఒక 6.18 అంగుళాల FHD+ ప్యూర్ డిస్ప్లేతో వస్తుంది. ఇంకొక వైపు, హానర్ వ్యూ 20  విషయానికి వస్తే, ఇది రూ.37,999 ధరతో ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంది.ఈ స్మార్ట్ ఫోన్, ఒక 48MP సెన్సారుతో వచ్చిన మొట్టమొదటి ఫోనుగా పేరుగాంచింది. ఈ రెండు ఫోన్లు,  ఎటువంటి స్పెక్స్ మనకు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం. 

ముందుగా వీటి డిస్ప్లేలను సరిపోల్చడంతో మొదలుపెడదాం,  నోకియా 8.1 ఫోన్  1080 x 2340  పిక్సెల్స్ రిజల్యూషన్ను అందించే ఒక 6.18-అంగుళాల FHD + ప్యూర్ డిస్ప్లేతో వస్తుంది. మరోవైపు, హానర్ వ్యూ 20 ఫోన్ 1080 x 2340 పిక్సల్స్ రిజల్యూషన్ కలిగి కొద్దిగా పెద్దదైన ఒక 6.39 -అంగుళాలడిస్ప్లేతో వస్తుంది.ఈ విభాగంలో పెద్ద స్క్రీన్ కోరుకునేవారికి హానర్ వ్యూ 20 ఎంపికగా ఉంటుంది. 

ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, నోకియా 8.1 ఒక క్వల్కామ్ స్నాప్ డ్రాగన్ 710 ఆక్టా కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరోవైపు, హానర్ వ్యూ 20 ఒక తాజా హై సిలికాన్ కిరిణ్ 980 ఆక్టా కోర్ ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది కూడా 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో వస్తుంది. ఈ విభాగంలో, నోకియా 8.1 ప్రాసెసర్ పరంగా కొంచెం వెనకబడి ఉంటుందని చెప్పొచ్చు.

కెమెరాల విషయానికి వస్తే, నోకియా 8.1 సెల్ఫీ లను క్లిక్ చేయడం కోసం ముందు ఒక 20MP కెమేరాతో పాటుగా వెనుక 12MP +13MP డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఇక హానర్ వ్యూ 20  ముందు 25MP సెన్సారుతో పాటు వెనుక ఒక 48MP సెన్సారుకు జతగా TOF 3D సెన్సర్ కలిగిన డ్యూయల్ కెమెరా ఏర్పాటుతో వస్తుంది.

నోకియా 8.1 అమేజాన్ నుండి రూ. 29,999 ధరతో అందుబాటులో ఉండగా, హానర్ వ్యూ 20  రూ. 37,999 రూపాయల ధరతో కొనుగోలుకు అందుబాటులోవుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :