స్పెక్స్ సరిపోలిక : మోటో G7 vs షావోమి పోకో F1
త్వరలో మోటో జి సిరీస్ రానున్నట్లు మోటో ప్రకటించింది కాబట్టి మిడ్ రేంజ్ ఫోన్లయినటువంటి మోటో జి7 మరియు షావోమి పోకో F1 ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
మోటరోలా జి సిరీస్ ఎంతో ప్రాచుర్యం పొందింది ఎందుకంటే మోరో సరసమైన ధర కింద మంచి లక్షణాలు అందించేఫోన్లు కాబట్టి. ఈ మోటో జి సిరీస్, సంస్థ యొక్క మరో మిడ్-రేంజ్ సెగ్మెంట్ సిరీసుగా అవతరిస్తుంది. మరొక వైపు, మేము షావోమి దాని మధ్యస్థాయి డివైజ్ "Poci F1" అందించిన ఫిచర్లతో గత సంవత్సరం మంచి సేల్స్ సాధించింది. కాబట్టి ముందునుండే మార్కెట్లో ఉన్నటువంటి మధ్యస్థాయి ఫోన్ అయినటువంటి, Xiaomi Poco F1 ఫోను లేదా మోటో G7 హార్డ్వేర్ పరంగా ఒక మెరుగైన ఎంపికగా ఉంటుందో, చూడటానికి వాటి స్పెక్స్ సరిపోలిక చేసిచూద్దాం.
మోటో జీ7 ఒక 1080 x 2270 పిక్సల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక 6.20 అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. మరొకవైపు షావోమి పోకో F1, 1080 x 2246 పిక్సెల్స్ యొక్క రిజల్యూషనుతో కూడిన కొంచెం చిన్నదైన ఒక 6.18-అంగుళాల డిస్ప్లేని కలిగివుంది.
వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, మోటో G7 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ఆక్టా -కోర్ ప్రాసెసరుతో వస్తుంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. అలాగే, మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు విస్తరించే సామర్ధ్యాన్ని కలిగి 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీని ఈ స్మార్ట్ ఫోన్ ప్యాక్ చేస్తుంది. మరోవైపు, షావోమి పోకో F1 తాజా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 చిప్సెట్టుతో మద్దతు ఇస్తుంది, ఇది Moto G7 లోని క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ కంటే వేగంగా ఉంటుంది. షావోమి పోకో F1 ఒక 6GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ, మరియు మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించే సమర్థ్యంతో వస్తుంది.
కెమెరాలకు సంబంధించినంతవరకూ, మోటో G7 వెనుకవైపు డ్యూయల్ 12MP + 5MP కెమెరా సెటప్ను కలిగి ఉంది మరియు ఇది ముందు 8MP సెన్సార్ను కలిగి ఉంది. మరోవైపు, షావోమి పోకో F1 డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరాలతో పాటు 20MP సెన్సార్ను ముందుభాగంలో కలిగివుంది.
షావోమి పోకో F1 భారతదేశంలో రూ .19,999 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉంది. మరోవైపు, Moto G సిరీస్ త్వరలో భారతదేశం లో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు.