స్పెక్స్ సరిపోలిక : మోటో G7 vs మోటో G7 ప్లస్
త్వరలో ఇండియాలో రానున్నట్లు అంచనా వేస్తున్న ఈ మోటో G స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
ఇండియాలో, తమ G సిరీస్ శ్రేణిలో నాలుగు కొత్త స్మార్ట్ ఫోన్లను విడుదల చేయబోతున్నామని ఎట్టకేలకు మోటరోలా ప్రకటించింది. ఈ నాలుగు పరికరాలలో కూడా G7 ప్లస్ చాలా ప్రీమియంగా ఉంటుంది. మోటరోలా G సిరీస్ ప్రధానంగా సరైన ధరలో మంచి లక్షణాలు అందించటంలో ప్రసిద్ధి చెందింది. ఏది ఏమైనప్పటికీ, ఈ సంస్థ యొక్క కొత్త స్మార్ట్ ఫోనులు, ప్రజల మన్ననలను పొందుతాయో లేదో అని కాలమే తేల్చి చెప్పుతుంది. అయితే, ఈ నాలుగు స్మార్ట్ ఫోన్ల నుండి పోల్చడానికి మేము G7 మరియు G7 ప్లస్ రెండు స్మార్ట్ ఫోన్లను ఎంచుకున్నాము. కాబట్టి, వీటి మధ్య తేడాలు ఏమిటో చూద్దాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్ల, డిస్ప్లేలు సరిపోల్చడంతో ప్రారంభిద్దాం. మోటో G7 ప్లస్ 1080 x 2270 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ అందిచే, ఒక 6.2-అంగుళాల డిస్ప్లే కలిగి ఉండగా Moto G7 కూడా అటువంటి 1080 x 2270 పిక్సెల్స్ ఒక రిజల్యూషన్ అందించే అదే 6.2-అంగుళాల డిస్ప్లేని కలిగివుంటుంది.
వీటి ప్రాసెసర్ల విషయానికి వస్తే, మోటో G7 ఒక క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, జతగా 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ మెమెరీతో మరియు మైక్రోSD కార్డు ద్వారా 128 జీబికి స్టోరేజి ఎంచుకునే సామర్ధ్యంతో వస్తుంది. ఇక Moto G7 ప్లస్ కొంచం వేగమైన, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 636 చిప్సెట్తో వస్తుంది, అది 4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో కలిసి ఉంటుంది, ఇది మైక్రో SD కార్డ్ ద్వారా 512GB వరకు స్టోరేజి పెంచుకునే సామర్ధ్యంతో వస్తుంది.
వీటి కెమెరాలకు వచ్చినప్పుడు, Moto G7 డ్యూయల్ 12MP + 5MP వెనుక కెమెరాలు మరియు 8MP సెన్సార్ను ముందు కలిగి ఉంది. మరొక వైపు, మోటో G7 ప్లస్ డ్యూయల్ 16MP + 5MP వెనుక కెమెరాలతో పాటు 12MP సెల్ఫీ కెమెరాని ముందుభాగంలో కలిగివుంటుంది.
Moto G సిరీస్ త్వరలో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. అయినప్పటికీ, వీటి విడుదల పైన సంస్థ ఎటులవంటి అధికారిక నిర్ధారణ ఇవ్వలేదు.