LG V40 ThinQ, భారతదేశంలో సుమారు రూ .45,000 ధరతో వస్తుందని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, భారతదేశంలో ప్రవేశపెట్టనున్నపుడు ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధరను మాత్రం ఈ సంస్థ చెప్పలేదు. ఈ డివైజ్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ద్వారా శక్తిని అందిస్తుంది మరియు ఒక 6.4 అంగుళాల QHD + డిస్ప్లేను కలిగివుంది. ఇంకొక వైపు, అత్యంత ప్రజాధారణ పొందిన ఫోన్లలో ఒకటైన "OnePlus 6T" , గత సంవత్సరము రూ .37,999 ధరతో ప్రారంభించబడింది. ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసరుతో నడుస్తుంది మరియు వెనుకవైపున డ్యూయల్ కెమెరాను ఏర్పాటుతో వస్తుంది. హార్డ్వేర్ పరంగా ఏ డివైజ్ ఉత్తమంగా రూపొందిందో తెలుసుకోవడానికి, ఈ రెండింటిని సర్పోల్లీ చూద్దాం.
ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఒక 6.4-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంటాయి. అయితే, 1080 x 2340 పిక్సల్స్ యొక్క ఒక రిజల్యూషనుతో వుండే వన్ ప్లస్ 6T, కంటే LG V40 Thin Q మెరుగైన 1080 x 3120 పిక్సల్స్ అందిస్తుంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, LG V40 Thin Q క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్, ఇంకా 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు పెంచవచ్చు. మరొక వైపు, OnePlus 6T కూడా అదే క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845 ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది. ఈ ఫోన్ 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీని ప్యాక్ చేస్తుంది, దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు పెంచవచ్చు.
కెమెరాలకు సంబంధించినంత వరకు. LG V40 థిన్ Q యొక్క ప్రధాన ముఖ్యాంశాలలో ఒకటిగా దాని ట్రిపుల్ రియర్ కెమెరా గురించి చెప్పవచ్చు. ఈ ఫోన్ 12MP ప్రాధమిక సెన్సార్ను కలిగి ఉంది,అలాగే 16MP అల్ట్రా-వైడ్ కోన్ సెన్సర్ మరియు 12MP టెలిఫోటో సెన్సరుతో పాటు ముందు డ్యూయల్ 8MP + 5MP కెమెరా సెటప్ కూడా ఉంది. ఇక OnePlus 6T విషయానికి వస్తే , ఈ ఫోన్లో ముందు ఒక 16MP యూనిట్తో డ్యూయల్ 16MP + 20MP వెనుక కెమెరా ఉంటుంది.
LG V40 థిన్ Q ప్లాటినం గ్రే, అరోరా బ్లాక్, మొరాకో బ్లూ, మరియు కార్మైన్ రెడ్ వంటి నాలుగు రంగు ఎంపికలతో భారతదేశంలో ప్రారంభించనున్నట్లు భావిస్తున్నారు. మీరు అమెజాన్ ద్వారా Rs 37,999 ధరతో భారతదేశంలో OnePlus 6T ని పొందవచ్చు.