స్పెక్స్ సరిపోలిక : లెనోవో Z5s vs రియల్మీ U1
చైనాలో సరికొత్తగా విడుదలకి చేయబడిన లెనోవో Z5s ప్రస్తుతం మంచి అమ్మకాలను సాధిస్తున్న రియల్మీ U1 కి గట్టి పోటీనిస్తుందో లేదో సరిపోల్చి చూద్దాం.
లెనోవో కంపెనీ, డిసెంబర్ 17 వ తేదిన చైనాలో సరికొత్తగా తన లెనోవో Z5s స్మార్ట్ ఫోన్ను విడుదలచేసింది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 710 ప్రాసెసెరుతో పనిచేస్తుంది మరియు ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో ఉంటుంది. ఈ ఫోన్ చైనాలో CNY 1,398 (సుమారుగా రూ.14,400) ధరతో విడుదల చేయబడింది. మరోవైపు, ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ కలిగిన రియల్మీ U1 వుంది. ఈ రియల్మీ U1 డ్యూ-డ్రాప్ నోచ్ కలిగిన డిస్ప్లే తో వస్తుంది. అయితే, వీటిలో ఏది బెస్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి తెలుసుకోవడానికి, ఈ రెండు ఫోన్లను సరిపోల్చి చూద్దాం.
ముందుగా, వీటి డిస్ప్లేలను సరిపోల్చడంతో మొదలుపెడదాం. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 1080x 2340 పిక్సెళ్లను అందించగల ఒక 6.3 అంగుళాల డిస్ప్లేను కలిగివుంటాయి. అల్లాగే, డిస్ప్లే పైభాగంలో కెమెరాని కలిగిన ఒక వాటర్ డ్రాప్ నోచ్ తో వస్తాయి ఈ రెండు ఫోనులు.
వీటి ప్రాసెసర్ల విషయానికివస్తే, ఈ లెనోవో Z5s స్నాప్ డ్రాగన్ 710 శక్తితో పనిచేస్తుంది మరియు ఇది 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత స్టోరేజితో జతగా వస్తుంది. మరోవైపు, ఒక మీడియా టెక్ హీలియో P70 ప్రాసెసర్ కలిగిన మొట్టమొదటి ఫోనుగా ఉంటుంది ఈ రియల్మీU1. ఈ డివైజ్ 4GB ర్యామ్ మరియు 64GB అంతర్గత మెమోరితో వస్తుంది మరియు మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు స్టోరేజిని విస్తరించుకోవచ్చు.
కెమేరా విభాగంలో, వెనుక ట్రిపుల్ కెమేరా సెటప్పును లెనోవో Z5s యొక్క ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. ఈ డివైజ్ 16MP+8MP+5MP రియర్ కెమేరా మరియు ముందు 16MP కెమేరాని కలిగివుంటుంది. మరొకవైపు, రియల్మీ U1 వెనుకభాగంలో 13MP +2MP డ్యూయల్ కెమేరా సెటప్పును మరియు ముందు 25MP సెన్సారుతో ఉంటుంది.
ఈ లెనోవో Z5s చైనాలో CNY 1,398 ధరతో విడుదల చేయబడింది మరియు ఇది మన కరెన్సీలో సుమారుగా రూ.14,400 ఉంటుంది. ఇండియాలో దీని విడుదల గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ఇంకొకవైపు, రియల్మీU1 రూ. 11,999 ధరతో ఇండియాలో కొనుగోలుకు అందుబాటులోవుంది.