స్పెక్స్ సరిపోలిక : లెనోవో Z5s vs లెనోవో Z5 ప్రో GT
ఒకటేమో బడ్జెట్ కెమేరా బెస్ట్ అయితే మరొకటి హార్డ్ వేర్ బెస్ట్ అందుకే సరిపోల్చిచూద్దాం!
చాల రూమర్లు, అంచనాల మరియు Z5s టీసింగ్ తర్వాత, లెనోవా చివరకు మంగళవారం చైనా లో ఈ స్మార్ట్ ఫోన్ను ప్రారంభించింది. లెనోవా Z5s తో పాటు, సంస్థ దాని రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ లెనోవా Z5 ప్రో GT ను కూడా ప్రకటించింది, ఇది 12GB RAM తో వుండనున్న ప్రపంచంలో మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా చెప్పవచ్చు. ఈ పరికరం జనవరి 2019 లో విడుదల చేయబడుతుంది. ఈ రెండు కొత్త స్మార్ట్ఫోన్లను పోల్చి చూద్దాం. ఫిచర్లు మరియు లక్షణాల ఆధారంగా ఏది గొప్పగా ఉంటుంది చూద్దాం.
లెనోవా Z5s స్మార్ట్ ఫోన్ 1080 x 2340 పిక్సల్స్ స్పష్టతను అందించే ఒక 6.3-అంగుళాల డిస్ప్లే తో వస్తుంది. మరోవైపు, Z5 ప్రో GT 2340 x 1080 పిక్సెల్స్ స్పష్టతను అందించే ఒక పెద్ద 6.39-అంగుళాల డిస్ప్లేను అందిస్తుంది.
వీటి ప్రాసెసర్ విషయానికి వస్తే, లెనోవా Z5 ప్రో GT ప్రపంచంలో మొట్టమొదటి సరిగా క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 855 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన స్మార్ట్ ఫోనుగా ఉండనుంది, ఇది 12GB RAM తో జత చేయబడింది. మరోవైపు, లెనోవా Z5s క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 710 ప్రాసెసర్ ఒక 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది.
కెమెరాల విభాగానికివస్తే, లెనోవా Z5s వెనుకవైపు ఏర్పాటు చేయబడిన ట్రిపుల్ కెమెరాను కలిగి ఉంటాయి, ఇది ఈ స్మార్ట్ఫోన్ యొక్క ప్రధాన హైలైట్. ఇది ముందు 16MP యూనిట్ మరియు 16MP + 8MP + 2MP ట్రిపుల్ వెనుక కెమెరా కలిగివుంది. మరోవైపు, లెనోవా Z5 ప్రో GT ఒక 16MP + 24MP డ్యూయల్ వెనుక కెమెరాలతో పాటుగా ముందు 16MP + 8MP డ్యూయల్ సెన్సర్లను కలిగి ఉంది.
లెనోవా Z5s చైనాలో CNY 1,396 (Appx Rs 14,000) వద్ద ప్రారంభించబడింది, లెనోవో Z5 ప్రో GT విడుదలకు జనవరి 2019 వరకు వేచి ఉండాల్సివుంటుంది.