స్పెక్స్ సరిపోలిక : హువావే P20 లైట్ vs హువావే నోవా 3i

Updated on 24-Dec-2018
HIGHLIGHTS

ఈరోజు మనం హువావే P20 లైట్ మరియు హువావే నోవా 3i స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి మనకు ఏది మంచి స్పెక్స్ అందిస్తుంది చూద్దాం.

బొకే  ఎఫెక్ట్, 3D పోర్ట్రైట్ లైటింగ్ ఎఫెక్ట్ మరియు మరిన్ని ఫీచర్లతో  వెనుక ఏర్పాటు చేసిన డ్యూయల్ కెమెరాతో లభించే అత్యుత్తమ మిడ్-రేంజ్ సెగ్మెంట్ పరికరాలలో హువాయ్ P20 లైట్ ఒకటి. ఇంకొక వైపు, మనకు మరొక హువాయ్ పరికరం "నోవా 3i" ఉంది, ఇది నోచ్ డిస్ప్లేతో మధ్యస్థాయి సెగ్మెంట్లో అందంగా పరిసుద్ధి చెందిన  స్మార్టు ఫోనుగా  ఉంది.  ఒక పరిమిత బడ్జెట్ క్రింద మీరు కొనుగోలు చేయగల ఫోన్ ఎడివుండుతుందో అని రెండు స్మార్ట్ఫోన్లను పోల్చాము.

ముందుగా ఈ రెండు స్మార్ట్ ఫోన్ల డిస్ప్లేలను పోల్చడం ద్వారా ప్రారంభిద్దాం. Huawei P20 లైట్ ఒక 5.84-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, ఇది 2280 x 1080 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందిస్తుంది. మరోవైపు, హవావే నోవా 3i ఫోన్ 1080 x 2340 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే ఒక పెద్ద 6.3 అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది. మీరు ఒక పెద్ద డిస్ప్లే కలిగిన  ఒక స్మార్ట్ ఫోన్  కోసం చూస్తున్నట్లయితే, ఈ నోవా 3i  ఎంచుకోవడానికి సరిగ్గా సరిపోతుంది.

వీటి  పనితీరు విషయానికి వస్తే, ఈ రెండు పరికరాలు కూడా హై -సిలికాన్ కిరిన్ 710 ఆక్టా – కోర్ ప్రాసెసర్ ద్వారా ఆధారిమైనవి. అయితే, హువావే పి 20 లైట్  4GB RAM మరియు 64GB అంతర్గత మెమరీ వస్తుంది, కానీ Huawei నోవా 3i 4GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజితో అందుబాటులో ఉంది. మైక్రో SD కార్డు ద్వారా 256GB వరకు స్టోరేజిని విస్తరించవచ్చు.

కెమెరాలకు సంబంధించినంతవరకు, హువావే పి 20 లైట్  వెనుకవైపు ద్వంద్వ 16MP + 2MP కెమెరా సెటప్ను కలిగి ఉంది, ఇది బోకె ఎఫెక్ట్, 3D పోర్ట్రైట్ లైటింగ్ ప్రభావం మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఇది ఒక 24MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరా కలిగి ఉంది. మరోవైపు, Huawei Nova 3i ఫోనులో మొత్తంగా నాలుగు కెమెరాలు ఉన్నాయి – ముందు రెండు మరియు వెనుక రెండు. ముందు, ఇది 24MP + 2MP కెమెరాలు కలిగి ఉంటుంది, వెనుకవైపు అది 16MP + 2MP సెన్సార్లను కలిగి ఉంటుంది.

హువావే నోవా 3i భారతదేశంలో 16,999 రూపాయలకు అందుబాటులో ఉంది, అదే సమయంలో మీరు అమెజాన్ ద్వారా రూ .14,999 ధరతో హూవావే పి 20 లైట్  ను పొందవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :