స్పెక్స్ సరిపోలిక : హువావే నోవా 4 vs హువావే మేట్ 20 ప్రో

Updated on 18-Dec-2018
HIGHLIGHTS

ఈ రెండు ఫోన్లు కూడా కెమెరాల పరంగా గొప్పగా ఉంటాయి కాబట్టి పోల్చి చూద్దాం

హువావే నోవా 4 ఇప్పుడు 48MP వెనుక కెమెరాతో ప్రారంభించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 48MP + 16MP + 2MP వెనుక కెమెరాలతో అమర్చబడి ఉంటుంది, అయితే ఇది 20MP + 16MP + 2MP వెనుక కెమెరాలతో విభిన్న సమ్మేళనంతో కలగలిపిన దాని లో -ఎండ్  వేరియంట్ కూడా ఉంది. ఇంకొక వైపు, మనకు  హువావే మేట్ 20 ప్రో వుంది, ఇది కొన్ని నెలల క్రితం భారతదేశంలో రూ .69,990 ధరతో, ఒక ట్రిపుల్ కెమెరాతో సెటప్ తో చేయబడినది. ఈ హువావే నోవా 4 ఇండియా విడుదల చేయడానికి విలువైనదో లేదో తెలుసుకోవటానికి లేదా మేట్ 20 ప్రో కి  వెళ్ళాలా? అనేవిషయాన్ని పోల్చి చూద్దాం. 

Huawei Mate 20 pro ఒక 1440 x 3120 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే 6.3-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, అదే సమయంలో Huawei Nova 4  కొద్దిగా పెద్దదైన  ఒక 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, అలాగే ఇది హువాయ్ మేట్ 20 ప్రో వలె రిజల్యూషన్నుఅందిస్తుంది. అయితే, మేట్ 20 ప్రో డిస్ప్లేలో  పైన ఒక నోచ్ తో వస్తుంది, కానీ హువావే నోవా 4 ప్రో మాత్రమే ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి, మీకు ఎక్కువ వీక్షణ ప్రాంతం మరియు పూర్తి బెజెల్ – లెస్ డిస్ప్లే ఇస్తుంది.

వీటి పనితీరు విషయానికి వస్తే, హువావే మేట్ 20 ప్రో ఒక కిరిన్ 980 ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగివుంటుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో ముడిపడివుంది, అలాగే హువావే నోవా 4 అనేది హూవావే యొక్క కిరిన్ 970 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది, ఇది 8GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో కలిసివుంటుంది.

కెమెరాల పనితీరు విషయానికివస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఈ విభాగంలో హైలైట్ గా ఉంటాయి, ఇవి రెండూకూడా వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును  కలిగివుంటాయి. Huawei Mate 20 pro ఒక 20MP + 40MP + 8MP వెనుక కెమెరా కలిగివుంది, అయితే హువాయ్ నోవా 4 ఒక ట్రిపుల్ 48MP + 16MP + 2MP సెన్సార్లను కలిగివుంది.

హువావే నోవా 4 ఒక punch Hole 25MP selfie కెమెరా కలిగిన  ప్రపంచంలో రెండవ స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా బెజెల్ -లెస్ గా ఉంటుంది. మరోవైపు, హువావే మేట్ 20 ప్రో ముందు 24MP సెన్సార్ను కలిగి ఉంది.

హువావే నోవా 4 చైనాలో యువాన్ 3,099 వద్ద ప్రారంభమైంది, ఇది దాదాపుగా రూ .32,000 (సుమారు) గా అనువదించబడింది. అయితే, ఈ  స్మార్ట్ ఫోన్నీ   భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే  గురించి ఇంకా ఏవిధమైన అధికారిక ప్రకటన సంస్థ నుండి రాలేదు. ఇంకొక వైపు, హువాయ్ మేట్ 20 ప్రో భారతదేశంలో రూ .69,990 ధరతో అందుబాటులోవుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :