స్పెక్స్ సరిపోలిక : హువావే నోవా 4 vs హువావే మేట్ 20 ప్రో
ఈ రెండు ఫోన్లు కూడా కెమెరాల పరంగా గొప్పగా ఉంటాయి కాబట్టి పోల్చి చూద్దాం
హువావే నోవా 4 ఇప్పుడు 48MP వెనుక కెమెరాతో ప్రారంభించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క హై ఎండ్ వేరియంట్ 48MP + 16MP + 2MP వెనుక కెమెరాలతో అమర్చబడి ఉంటుంది, అయితే ఇది 20MP + 16MP + 2MP వెనుక కెమెరాలతో విభిన్న సమ్మేళనంతో కలగలిపిన దాని లో -ఎండ్ వేరియంట్ కూడా ఉంది. ఇంకొక వైపు, మనకు హువావే మేట్ 20 ప్రో వుంది, ఇది కొన్ని నెలల క్రితం భారతదేశంలో రూ .69,990 ధరతో, ఒక ట్రిపుల్ కెమెరాతో సెటప్ తో చేయబడినది. ఈ హువావే నోవా 4 ఇండియా విడుదల చేయడానికి విలువైనదో లేదో తెలుసుకోవటానికి లేదా మేట్ 20 ప్రో కి వెళ్ళాలా? అనేవిషయాన్ని పోల్చి చూద్దాం.
Huawei Mate 20 pro ఒక 1440 x 3120 పిక్సెల్స్ యొక్క రిజల్యూషన్ను అందించే 6.3-అంగుళాల డిస్ప్లేని కలిగి ఉంది, అదే సమయంలో Huawei Nova 4 కొద్దిగా పెద్దదైన ఒక 6.4-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంది, అలాగే ఇది హువాయ్ మేట్ 20 ప్రో వలె రిజల్యూషన్నుఅందిస్తుంది. అయితే, మేట్ 20 ప్రో డిస్ప్లేలో పైన ఒక నోచ్ తో వస్తుంది, కానీ హువావే నోవా 4 ప్రో మాత్రమే ఒక పంచ్ హోల్ సెల్ఫీ కెమెరా కలిగి, మీకు ఎక్కువ వీక్షణ ప్రాంతం మరియు పూర్తి బెజెల్ – లెస్ డిస్ప్లే ఇస్తుంది.
వీటి పనితీరు విషయానికి వస్తే, హువావే మేట్ 20 ప్రో ఒక కిరిన్ 980 ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగివుంటుంది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో ముడిపడివుంది, అలాగే హువావే నోవా 4 అనేది హూవావే యొక్క కిరిన్ 970 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది, ఇది 8GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో కలిసివుంటుంది.
కెమెరాల పనితీరు విషయానికివస్తే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా ఈ విభాగంలో హైలైట్ గా ఉంటాయి, ఇవి రెండూకూడా వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును కలిగివుంటాయి. Huawei Mate 20 pro ఒక 20MP + 40MP + 8MP వెనుక కెమెరా కలిగివుంది, అయితే హువాయ్ నోవా 4 ఒక ట్రిపుల్ 48MP + 16MP + 2MP సెన్సార్లను కలిగివుంది.
హువావే నోవా 4 ఒక punch Hole 25MP selfie కెమెరా కలిగిన ప్రపంచంలో రెండవ స్మార్ట్ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ పూర్తిగా బెజెల్ -లెస్ గా ఉంటుంది. మరోవైపు, హువావే మేట్ 20 ప్రో ముందు 24MP సెన్సార్ను కలిగి ఉంది.
హువావే నోవా 4 చైనాలో యువాన్ 3,099 వద్ద ప్రారంభమైంది, ఇది దాదాపుగా రూ .32,000 (సుమారు) గా అనువదించబడింది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్నీ భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించబోతున్నారనే గురించి ఇంకా ఏవిధమైన అధికారిక ప్రకటన సంస్థ నుండి రాలేదు. ఇంకొక వైపు, హువాయ్ మేట్ 20 ప్రో భారతదేశంలో రూ .69,990 ధరతో అందుబాటులోవుంది.