స్పెక్స్ సరిపోలిక : హానర్ వ్యూ 20 vs షావోమి పోకో F1

Updated on 31-Jan-2019
HIGHLIGHTS

స్పీడ్ మరియు కెమెరాలు ప్రధానాంశంగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

హానర్ వ్యూ 20 అనేది ఒక TOF 3D కెమెరాతో కలిసి వెనుక ఒక 48MP సెన్సారుతో ప్రపంచంలోని మొట్టమొదటి స్మార్ట్ ఫోనుగా ఉంటుంది. ఈ పరికరం భారతదేశంలో రూ .37,999 ధరతో తో ఉంది మరియు Amazon.in నుండి సేల్ చేయబడుతుంది . మరొక వైపు,  Xiaomi Poco F1 , గత సంవత్సరం మార్కుట్లోకి వస్తూనే,  ప్రీమియం ఫోన్లకు కూడా కఠినమైన పోటీని ఇచ్చింది. ఇది వెనుక డ్యూయల్ కెమెరాతో సెటప్పుతో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసరుతో శక్తితో వస్తుంది. కాబట్టి, ఈ రెండు స్మార్ట్ ఫోన్లను సరిపోల్చి చూద్దాం.

షావోమి పోకో F1 1080 x 2246 పిక్సెళ్లతో కూడిన ఒక చిన్న 6.18 అంగుళాల డిస్ప్లేని కలిగివుంటే, హానర్ వ్యూ 20 1080 x 2310 పిక్సల్స్ రిజల్యూషనుతో, పెద్దడైన  ఒక 6.39 అంగుళాల డిస్ప్లేని అందిస్తుంది.

హానర్ వ్యూ 20 కిరిన్ 980 ఆక్టా -కోర్ ప్రాసెసర్,  6GB RAM మరియు 128GB అంతర్గత మెమరీతో జత చేయబడింది. మరొక వైపు, షావోమి పోకో F1 క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ ద్వారా మద్దతు ఇస్తుంది, ఇది 6GB RAM మరియు 64GB అంతర్గత మెమరీతో జతగా వస్తుంది.                                             

హానర్ వ్యూ 20 ముందువైపు 25MP సెన్సార్ మరియు  వెనుకవైపు డ్యూయల్ 48MP + TOF 3D కెమెరా సెటప్పును కలిగి ఉంది. మరొక వైపు, Xiaomi Poco F1 ముందు ఒక 20MP సెన్సార్ తో వెనుక 12MP + 5MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది.

అమెజాన్ నుండి రూ .37,999 ధరతో హానర్ వ్యూ 20 లభిస్తుంది, ఇక Xiaomi Poco F1 భారతదేశంలో 19,999 రూపాయలకు అందుబాటులో ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :